Jani Master Arrest

Jani Master: లైంగిక వేధింపులకు సంబంధించిన కేసును ఎదుర్కొన్న జానీ మాస్టర్ తాజాగా బెంగళూరులో హైదరాబాదులోని ఎస్ఓటి పోలీసులకు దొరికిపోయాడు. దీంతో ఆయన్ని బెంగళూరులో అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్ కు తరలిస్తున్నారు. అలాగే రేపో మాపో కోర్టులో కూడా హాజరు పరుస్తున్నారు.

Jani Master Arrest

ఇప్పటికే లేడీ కొరియోగ్రాఫర్ అయినటువంటి ఆ అమ్మాయిని కేవలం 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే అత్యాచారం చేయడంతో జానీ మాస్టర్ పై ఫోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదంతా పక్కన పెడితే తాజాగా జానీ మాస్టర్ భార్య పెద్ద సెన్సేషన్ సృష్టించింది.. (Jani Master)

Also Read: Jani Master: టాలీవుడ్ స్టార్ హీరో ఇంట్లో తలదాచుకున్న జానీ మాస్టర్.?

అంతేకాదు జానీ మాస్టర్ భార్య పోలీస్ స్టేషన్ కి రావడానికి కారణం ఏంటి అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇక జానీ మాస్టర్ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అని ఆమెకు ఒక ఫేక్ కాల్ రావడంతో నార్సింగి పోలీస్ స్టేషన్ కి వచ్చానని చెప్పింది.

Jani Master Arrest

కానీ ఎంత తొందరగా పోలీస్ స్టేషన్ కు వచ్చిందో అంతే తొందరగా మళ్ళీ అక్కడినుండి ఇంటికి వెళ్లిపోయింది. ఇక సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. బెంగళూరులో జానీ మాస్టర్ ఉన్నాడని ఎస్వోటీ పోలీసులకు తెలిపింది జానీ మాస్టర్ భార్య సుమలతనేనని, ఆమె వల్లే జానీ మాస్టర్ ని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు సమాచారం.(Jani Master)