Heritage Company: తెలంగాణ రాష్ట్రంలో.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి.. చంద్రబాబు మార్కు స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ జెండా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కనిపించలేదు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత… మళ్లీ తెలుగు తమ్ముళ్లు తెరపైకి వస్తున్నారు. Heritage Company

Heritage invests heavily in Telangana with Rs.204 crores

అటు శని అలాగే ఆదివారాలలో… హైదరాబాదులోనే ఉంటున్న చంద్రబాబు నాయుడు.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేపే ప్రయత్నాలు చేస్తున్నారు. గులాబీ పార్టీ ప్రభావం తగ్గించే దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. వాస్తవానికి ఏపీకి చెందిన ఏ క్క రాజకీయ నాయకుడిని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కానీ చంద్రబాబు నాయుడు బలవంతంగా తెలంగాణకు పసుపు.. పూత పూసేందుకు.. కుట్రలు పన్నుతున్నాడని వార్తలు వస్తున్నాయి. Heritage Company

Also Read: Balineni Srinivas: వైసీపీకి రాజీనామా.. జనసేనలోకి బాలినేని శ్రీనివాస్ రెడ్డి?

అయితే ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి తో కలిసి.. చంద్రబాబు నాయుడు భారీ ప్లాన్ వేశారని సమాచారం. తెలంగాణలో చంద్రబాబు నాయుడు కు సంబంధించిన కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కు సంబంధించిన హెరిటేజ్ సంస్థ.. దాదాపు 200 కోట్ల పెట్టుబడులు పెట్టనుందట. షామీర్పేటలో.. పెద్ద ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీని పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుందట హెరిటేజ్ సంస్థ. అయితే దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. Heritage Company