Tirumala: తిరుమల శ్రీవారి ప్రసాదం పైన.. గత రెండు రోజులుగా ఏపీలో వివాదం కొనసాగుతోంది. తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వులు వాడుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు. అయితే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ సంఘటన జరిగినట్లు… వెల్లడించారు నారా చంద్రబాబు నాయుడు. Tirumala

Uproar over Tirumala Laddu Prasad YCP

దీంతో ఈ వివాదం… రెండు రాష్ట్రాలను కుదిపేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా ఉన్న తిరుమల… భక్తులను కలచి వేస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ తరఫున కూడా కౌంటర్ వస్తోంది. వైసిపి పాలనలో చైర్మన్లుగా పనిచేసిన భూమన, వై వి సుబ్బారెడ్డి ఇద్దరు స్పందించారు. తమ పాలనలో తిరుమలలో కల్తీ జరిగితే.. శ్రీవారు తమల్ని శిక్షిస్తారని వెల్లడించారు. Tirumala

Also Read: Chandrababu: తిరుమల లడ్డులో నెయ్యికి బదులు జంతువుల నూనె ?

ఒకవేళ జంతువుల కొవ్వు వాడకపోతే… చంద్రబాబు కాళ్లు చేతులు పడిపోతాయని… శ్రీవారు అలా.. శిక్షిస్తారని డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణస్వామి…. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించేందుకే చంద్రబాబు నాయుడు ఇలా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహించారు. ఈవీఎంల ద్వారా విజయం సాధించిన చంద్రబాబు నాయుడు… ఇలాగే వ్యవహరిస్తారని మండిపడ్డారు. ప్రజల ఓట్లతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి చాలా బ్రహ్మాండంగా పాలించాడని కొనియాడారు. Tirumala