Atishi Marlena Singh: అతిషీ.. ఎప్పటికప్పుడు వార్తల్లోకెక్కుతూ ముఖ్య నాయకురాలిగా ఎదుగుతున్న ఈమె 43 ఏళ్ల వయసులో ఢిల్లీ మూడో మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అంతకు ముందు, బీజేపీ నుంచి సుష్మ స్వరాజ్, కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్ సీఎంలుగా ఉన్నారు. అతిషీ కూడా త్వరలోనే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కలిసి, ఇండియా కూటమిలో కీలక మహిళా నాయకురాలిగా మారతారని భావిస్తున్నారు. ఇంతకీ ఈ అతిశీ ఎవరు.. మాజీ సీఎం అతిషీ నే సీఎం గా ఎంచుకోవడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.
Why Arvind Kejriwal Chose Atishi as Delhi’s CM
2022 ఏప్రిల్‌లో ఢిల్లీలోని జహంగీర్‌పురిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ అనంతరం కొన్ని నిర్మాణాలను కూల్చివేయడం సంచలనం సృష్టించింది. అయితే, కోర్టు ఆదేశాలతో ఈ కూల్చివేతలను నిలిపివేశారు. ఆ సమయంలో, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ముగ్గురు కీలక నేతలు, గొడవకు బంగ్లాదేశ్ ప్రజలు, రోహింగ్యాలు కారణమని ఆరోపించారు. ఈ ఆరోపణలు బీజేపీ వాదనలకు సమానంగా ఉండటంతో, ఆప్ కూడా హిందువులకు మద్దతు తెలుపుతున్నట్లు కనిపించింది. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కీలక నేతలలో ఒకరు అతిషీ.
Also Read: Rohit Sharma: విరాట్ కోహ్లి మీద చిరకుపడ్డ రోహిత్.. బంగ్లా మ్యాచ్ లో విడ్డూరం!!
అతిషీ రాజకీయాల్లో తన దారిని చాలా వేగంగా చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి మార్క్సిజం ప్రభావం ఉన్న ఆమె, ఢిల్లీ యూనివర్శిటీలో చదువుకుని, ఆక్స్‌ఫర్డ్‌లో పీజీ పూర్తి చేశారు. సామాజిక సేవా కార్యక్రమాలలో ఆమె పాత్ర ముఖ్యమైనది. 2010లో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులతో కలసి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని, ఆ పార్టీ నిర్మాణానికి సహకరించారు.
ఆమె విద్యా రంగంలో కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వ స్కూళ్లను మెరుగుపరచడంలో, విద్యా ప్రమాణాలను పెంచడంలో ఆమె దోహదపడిన నాయకురాలిగా గుర్తింపు పొందారు.2012లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆవిర్భావం చెందింది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పాల్గొన్నప్పుడు, అతిషీ మేనిఫెస్టో కమిటీ సభ్యురాలిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అయితే, ఆ ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజార్టీ రాకపోయినా, ఆప్ కాంగ్రెస్‌తో కలిసి తాత్కాలికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ పొత్తు ఎక్కువ రోజులు నిలవకపోవడంతో 2015లో మళ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ సారి ఆప్ 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో 67 సీట్లు సాధించి ఘన విజయాన్ని అందుకుంది. అప్పట్లో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు అతిషీ విద్యా శాఖలో సలహాదారుగా పనిచేశారు.
2019 సాధారణ ఎన్నికల్లో ఆప్ అతిషీని ఈస్ట్ ఢిల్లీ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టగా, బీజేపీ నుంచి క్రికెటర్ గౌతమ్ గంభీర్ పోటీలో నిలిచారు. ఆ ఎన్నికల్లో గంభీర్ విజయం సాధించగా, అతిషీ పరాజయం పాలయ్యారు. అయినప్పటికీ, ఆమెను ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నిలబెట్టగా, విజయం సాధించి, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.