Hyderabad: హైదరాబాద్ మహానగరంలో… రియల్ ఎస్టేట్ రంగం దారుణంగా పడిపోయిందని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు అయిన తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గులాబీ పార్టీ నేతలు ఇదే అంశాన్ని ప్రతిసారి… చెప్పినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో అసలు… కదలిక రావడం లేదు. Hyderabad

Hyderabad Real Estate Update

తాజాగా ఓ రియల్ ఎస్టేట్ సర్వే సంస్థ కూడా.. హైదరాబాద్ మహానగరంలో 42 శాతం రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని తేల్చింది. జూన్ మాసం నుంచి సెప్టెంబర్ వరకు… కేవలం 12 వేల ఇండ్లు మాత్రమే విక్రయాలు జరుపుకున్నాయని ఈ సర్వే సంస్థ వెల్లడించింది. Hyderabad

Also Read: BJP Madhavi Latha: అయోధ్య రాముడి వల్లే.. తిరుమల లడ్డు గుట్టు బయటపడింది !

ఇదే సమయంలో గత సంవత్సరం… దాదాపు 20 వేలకు పైగా ఇండ్లు అమ్ముడుపోయాయి అని తెలిపింది. ఈ లెక్క ప్రకారం హైదరాబాదులో 42 శాతం రియల్ ఎస్టేట్ రంగం తగ్గిపోయిందని ఈ సర్వే సంస్థ తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, హైడ్రా రంగంలోకి దిగడం, హైదరాబాదులో క్రైమ్ రేట్ విపరీతంగా పెరగడం కూడా… దీనికి కారణం అని చెబుతున్నారు. Hyderabad