Team India: టి20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత టీమిండియా మంచి ఊపులో ఉంది. చాలా రోజుల గ్యాప్ తర్వాత టెస్ట్ మ్యాచ్లు ఆడిన టీమ్ ఇండియా…బంగ్లాదేశ్ లో చిత్తు చేసి మొదటి మ్యాచ్ లో విజయం సాధించింది. ఏకంగా బంగ్లాదేశ్ జట్టును 280 పరుగుల తేడాతో… చిత్తు చేసింది టీం ఇండియా జట్టు. దీంతో రికార్డు స్థాయి విజయాన్ని నమోదు చేసుకుంది. Team India
WTC tension for Team India How many matches should be won to go to the final
టీమిండియా బ్యాటర్లు అలాగే బౌలర్లు అద్భుతంగా రాణించడంతో… ఈ విజయాన్ని సాధించగలిగింది. ముఖ్యంగా రవిచంద్రన్ అశ్విన్ ఆల్ రౌండర్ ప్రదర్శనతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. సెంచరీ చేయడంతో పాటు ఆరు వికెట్లు పడగొట్టాడు అశ్విన్. దీంతో ఆయనకు మేన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. అయితే బంగ్లాదేశ్ పైన విజయం సాధించిన టీమిండియా కు కొత్త టెన్షన్ మొదలైంది. Team India
Also Read: IND VS BAN: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 92 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలోనే
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో… బెర్త్ ఖరారు చేసుకోవాలనుకుంటే.. టీమిండియా మరో ఆరు మ్యాచ్లు గెలివాల్సి ఉంది. ఇప్పటినుంచి మరో 9 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది టీమిండియా. ఇందులో కచ్చితంగా ఆరు గెలవాలి. బంగ్లాదేశ్ జట్టుతో ఒకటి, న్యూజిలాండ్ తో మూడు, మరో ఐదు మ్యాచ్లు ఆస్ట్రేలియా తో ఆడనుంది. ఇందులో కచ్చితంగా ఆరు మ్యాచులు.. గెలిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ఫైనల్ కు అర్హత సాధిస్తుంది టీమిండియా. అటు ఆస్ట్రేలియా కూడా ఖచ్చితంగా అన్ని… మ్యాచులు గెలవాల్సి ఉంది. Team India