Chiranjeevi: టాలీవుడ్ లెజెండరీ హీరో చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో రూపొందిన “విశ్వంభర” సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, చిరు గత చిత్రం ‘ఆచార్య’ దారుణంగా పరాజయం పొందడంతో అప్పట్లో చర్చ జరిగింది.

Chiranjeevi and Koratala Siva Clarify Rumors of Cold War

ఈ క్రమంలో, చిరంజీవి మరియు దర్శకుడు కొరటాల శివ మధ్య మినీ కోల్డ్ వార్ నడుస్తోందని, ఆ సినిమా ఫలితంపై కొరటాల శివ చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ అయ్యాయని ప్రచారం జరిగింది. అయితే, తాజాగా, ‘దేవర’ ప్రమోషన్ సమయంలో కొరటాల శివ స్పందిస్తూ, అసలు ఆయనకి తనకి ఎలాంటి కోల్డ్ వార్ లేదని క్లారిటీ ఇచ్చాడు.

Also Read: Devara: దేవర మూవీ లో హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకున్న అన్ లక్కీ బ్యూటీ.?

తమ ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని, చిరు స్నేహపూర్వకంగా తనకు ‘నువ్వు బౌన్స్ బ్యాక్ అవుతావు’ అంటూ సందేశం పంపించారని కొరటాల తెలిపారు. గతంలో ఉన్న అపార్థాలు క్లీన్ అయ్యాయని, ఇకపై ఎలాంటి సమస్యలు లేవని స్పష్టత ఇచ్చారు.అయన దర్శకత్వం వహించిన దేవర చిత్రం విడుదల కి సిద్ధంగా ఉంది.