PrakashRaj: తిరుమల లడ్డు కల్తీ అంశం ఏపీ రాజకీయాల్లో పెద్ద కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని అధికార పార్టీతో పాటు, ఇతర రాజకీయ పార్టీలు కూడా ఈ అంశంపై గత కొంతకాలంగా చర్చ జరుపుతున్నాయి, అంతేకాకుండా గత ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్, ఉప మంత్రి పవన్ కళ్యాణ్‌పై వ్యాఖ్యలు చేసి వివాదానికి మరింత మసాలా అద్దారు.
PrakashRaj Questions Pawan Kalyan Over Tirumala Laddu Controversy
డిప్యూటీ సీఎం తిరుమల లడ్డూ అంశంపై సమీక్షించవచ్చు కానీ, దీనిని జాతీయ స్థాయిలో ఎందుకు పెద్ద ఇష్యూ చేస్తున్నారంటూ ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. “ఈ దేశంలో ఇప్పటికే మతపరమైన సమస్యలు అనేకం ఉన్నాయి. కేంద్రంలోని మీ మిత్రులకు కృతజ్ఞతలు చెప్పడానికే ఈ రచ్చ చేస్తున్నారా?” అంటూ ఘాటుగా విమర్శలు చేశారు.
Also Read: Chiranjeevi: చిరు, కొరటాల శివ కి ఉన్న విబేధాలు ఇవే.. క్లియర్ అయ్యాయా?
ఈ నేపథ్యంలో, పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, “ప్రకాష్ రాజ్ అన్నీ వివరంగా తెలుసుకుని మాట్లాడాలి. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తే ఊరుకోను,” అని హెచ్చరించారు. అలాగే, “ఏదైనా తప్పు జరిగితే మీరు స్పందించరా?” అని ప్రశ్నించారు.
పవన్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా, ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో X లో వీడియో పోస్ట్ చేశారు. “మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, మీ ప్రెస్ కాన్ఫరెన్స్ చూడాను. నేను చెప్పింది ఎవరూ అపార్థం చేసుకోకూడదు. మీరు వక్రీకరించారనే అనిపిస్తోంది. ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను, 30వ తేదీ తర్వాత వస్తాను, మీ ప్రశ్నలకు సమాధానం ఇస్తాను. మీకు వీలైతే నా ట్వీట్‌ని మళ్లీ ఒకసారి పరిశీలించండి” అని ప్రకాష్ రాజ్ అన్నారు.