Devara vs Sathyam Sundaram: చాలా కాలం తర్వాత, ఈ శుక్రవారం థియేటర్లలో భారీ స్థాయిలో బుకింగ్స్‌ జరుగుతున్నాయి. ఎన్నో రోకులకు ఒక పెద్ద సినిమా విడుదల జరగబోతోంది. ఎన్టీఆర్ (జూనియర్ ఎన్టీఆర్) నటించిన పెద్ద చిత్రం “దేవర” ఈ వారం విడుదల కానుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 27 శుక్రవారం అన్ని భారతీయ భాషల్లో విడుదల కానున్నది. అదనంగా, తమిళ హీరో కార్తీ నటించిన “సత్యం సుందరం” కూడా ఈ వారం థియేటర్లలో విడుదల కాబోతోంది.

Back-to-Back Releases: “Devara” and “Satyam Sundaram” Hit Theatres

అయితే ఈ సినిమా తమిళంలో దేవర తో పాటుగా రిలీజ్ అవుతుండగా తెలుగు లో మాత్రం ఈ చిత్రం ఒకరోజు తర్వాత విడుదల అవుతుంది. అలా ఈ వారం విడుదలవుతున్న ఈ రెండు చిత్రాలు ఒకేసారి రావడం ఆసక్తిగా ఉంది. ఈ సినిమాలకు లాంగ్ రన్ టైమ్ ఉండటంతో పాటు, “దేవర” 2 గంటల 57 నిమిషాలు, అలాగే కార్తీ యొక్క “సత్యం సుందరం” కూడా 2 గంటల 57 నిమిషాల నిడివి కలిగి ఉంది.

Also Read: Pawan Kalyan: పవన్ కు కార్తీ క్షమాపణ చెప్పడం ఎంతవరకు కరెక్ట్!!

ఈ శుక్రవారం ఇద్దరు ప్రముఖ హీరోల సినిమాలు ఒకేసారి విడుదల కావడం ఆసక్తికరమే అయినా ఒకే రన్ టైం తో రిలీజ్ అవడం యాదృచ్చికమే. మరి ఈ రెండు సినిమాలు ఎలాంటి ఫలితాలను సాధిస్తాయో చూడాలి.