Rohit Sharma: చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ ను ఓడించిన భారత జట్టు ఇప్పుడు రెండో టెస్ట్ మ్యాచ్ కు సిద్ధమవుతోంది. రెండో టెస్ట్ మ్యాచ్ కి భారత జట్టును కూడా ఇది వరకే అనౌన్స్ చేశారు. దీని ప్రకారం తొలి టెస్ట్ మ్యాచ్ ఆడిన ఆటగాళ్లతోనే దాదాపు రెండో టెస్ట్ మ్యాచ్ కు భారత్ బరిలోకి దిగనుంది. Rohit Sharma

Rohit Sharma Big Plane For Second Test Over Bangladesh

ఈ రెండవ టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 27వ తేదీ నుంచి కాన్పూర్ వేదికగా హాజరు అవుతుంది. వాస్తవంగా కాన్పూర్ పిచ్…. స్పిన్ బౌలర్లకు అనుకూలిస్తుందనే సంగతి తెలిసిందే. అయితే స్పిన్ బౌలింగ్ ను దృష్టిలో పెట్టుకొని రెండవ టెస్టు కోసం టీమ్ ఇండియా సిద్ధం కాబోతోంది. ఇందులో భాగంగానే ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ ను బరిలోకి దింపడానికి రోహిత్ శర్మ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది.

Also Read: Team India: టీమిండియాకు WTC టెన్షన్.. ఫైనల్ కు వెళ్లాలంటే ఎన్ని మ్యాచ్లు గెలవాలి ?

మూడవ స్పిన్నర్ ను తీసుకుంటే కచ్చితంగా కుల్దీప్ యాదవ్ ను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. టెస్టుల్లో అయితే కచ్చితంగా కుల్దీప్ యాదవ్ రాణించగలుగుతాడు. అయితే కుల్దీప్ యాదవ్ జట్టులోకి రావాలంటే ఖచ్చితంగా ఒక ఫాస్ట్ బౌలర్ పక్కకు తప్పుకోవాలి. ఆకాష్ దీప్ ను పక్కన పెట్టి అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ ను జట్టులోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.