Devara: “దేవర” సినిమాపై రోజురోజుకు అంచనాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన రెండు ట్రైలర్లు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. సెప్టెంబర్ 27న సినిమా విడుదలకాబోతుండగా ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, మన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హీరోల సినిమాలకు టిక్కెట్ ధరలను పెంచేందుకు ప్రభుత్వాలు అనుమతిస్తూ వస్తున్నాయి.

Challenging Conditions for ‘Devara’ in Telangana

ఈ క్రమంలో, ఆంధ్రప్రదేశ్‌లో “దేవర” సినిమా టిక్కెట్ ధరలను పెంచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందుకు ప్రత్యేకంగా ఒక జీవో కూడా విడుదలైంది. కానీ తెలంగాణలో మాత్రం ఎన్టీఆర్‌కు భారీ షాక్ తగిలింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తొలి రోజు 29 థియేటర్లలో మాత్రమే ఆరు ప్రదర్శనలకు అనుమతి ఇచ్చారు. అంతేకాదు, ఆరు షోలకే టిక్కెట్ ధరను రూ.100 పెంచే అవకాశం కల్పించారు. రెండు రోజుల నుంచి పది రోజుల వరకు, రోజుకి ఐదు ప్రదర్శనలకే పరిమితం చేశారు.

Also Read: MUDA case Siddaramaiah: సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ.. కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రి?

సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టిక్కెట్ ధరలను రూ.25 పెంచేందుకు, మల్టీప్లెక్స్‌లలో రూ.50 వరకు పెంచేందుకు అనుమతి ఇచ్చారు. ఈ నిర్ణయం “దేవర” టీమ్‌ను ఆశ్చర్యపరిచింది, ఎందుకంటే ఇంతకుముందు ఏ పెద్ద హీరో సినిమా కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు. పైగా, ఇది భారీ బడ్జెట్ సినిమా కాబట్టి, నైజాం ఏరియాలో వసూళ్లు సినిమా లాభాలకు కీలకం. ఇలాంటి పరిమితితో వర్కవుట్ అవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌కు శుభవార్త వస్తే, తెలంగాణలో మాత్రం ఈ పరిణామం ఆయనకు షాక్ ఇచ్చినట్లు అనిపిస్తోంది.