Sai Pallavi: సాయిపల్లవికి ఉన్న ఫాలోయింగ్ వేరే హీరోయిన్లకు ఉండదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆమె నటన కంటే, ఆమె వ్యక్తిత్వమే ఎక్కువ మందిని ఆకట్టుకుంటోంది. తనదైన స్వభావం మరియు సహజత్వం ఆమెను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఇప్పటివరకు అనేక సినిమాల్లో నటించిన సాయిపల్లవి, ప్రస్తుతం “తండేల్” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాకుండా, బాలీవుడ్‌లోనూ ఒక పెద్ద బడ్జెట్ సినిమాలో నటించబోతోంది.

Sai Pallavi Inter-Caste Marriage Acceptance

తాజాగా, కులాంతర వివాహాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. బాల్యంలో తన కుటుంబం కులాల పరిధిలోనే వివాహాలు చేసుకోవాలని కోరిందని, కానీ తన చుట్టూ ఉన్న వారు ఇప్పుడే కులాంతర వివాహాలు చేసుకుని సంతోషంగా ఉన్నారని తెలిపారు. అయితే, ఆ వ్యక్తులు తమ కుటుంబాల నుండి దూరంగా ఉన్నారు, ఎందుకంటే తమ కులం కులాంతర వివాహాలను అంగీకరించదు.

Also Read: Lemon Water: ఖాళీ కడుపుతో నిమ్మరసం నీళ్లు తాగితే.. అయితే డేంజర్ లో పడ్డట్టే ?

సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత, తన గురించి ప్రజలకు తెలియడం మొదలైనది. ఆమెకు కూడా కులాంతర వివాహం చేసుకోవాలనే కోరిక ఉందని వెల్లడించింది. త తల్లిదండ్రులు ఈ నిర్ణయాన్ని అంగీకరించారని, పిల్లల స్వేచ్ఛను తల్లిదండ్రులు గౌరవించాలి అని ఆమె అభిప్రాయపడింది. సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, ఆమె ఎవరితో ప్రేమలో ఉందా అనే ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి.