Kalki: రెబల్ స్టార్ ప్రభాస్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు రాణిస్తూ ప్రేక్షకుల్ని బాగా కట్టుకున్నారు. ప్రభాస్ గత ఏడాది సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీ తలకెక్కించిన సలార్ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అప్పటివరకు వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న ప్రభాస్ కు సలార్ సినిమా పెద్ద ఊరటను ఇచ్చింది.

Also Read: Jagan: కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనం…. జగన్ భయపడిపోతున్నాడా ?

సలార్కు ముందు ప్రశాంత్ నీల్ కన్నడ స్టార్ హీరో యష్ తో కేజిఎఫ్ , కేజిఎఫ్ 2 తర్కెక్కించారు. ఈ రెండు సినిమాలు భారీ విజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ నమోదు చేశాయి. దీనితో ప్రభాస్, ప్రశాంత్ నీల్ సినిమా పై భారీగా క్రేజ్ ఏర్పడింది. దీనితో సలార్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “కల్కి 2898 ఏడి”. మహానటి ఫేమ్ నాగ అశ్విన్ కల్కి సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మించారు.

Kalki hit the Salar bookings

మేకర్స్ కల్కి సినిమాను జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అయ్యాయి. ప్రభాస్ కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన కొన్ని నిమిషాల్లోనే చాలా థియేటర్స్ హౌస్ పుల్ అయ్యాయి. గత ఏడాది వచ్చిన సలార్ అడ్వాన్సు బుకింగ్స్ ను కల్కి సినిమా రిలీజ్ ఒక రోజుకు ముందుగానే క్రాస్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. దీనితో ప్రభాస్ కల్కి సినిమాపై భారీగా క్రేజ్ ఏ రేంజ్ లో వుందో తెలుస్తుంది. ఈ సినిమాని మీరు కూడా మిస్ కాకుండా చూడండి.