Devara: ‘దేవర’ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని దర్శకుడు కొరటాల శివ నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని ఆయనే వివరించారు. “కథ రాయడంలో మాకు చాలా ఆసక్తికరమైన విషయాలు దొరికాయి. పాత్రలు, సన్నివేశాలు అన్నీ చాలా బాగున్నాయి. కానీ సినిమా నిడివి కాస్త ఎక్కువ అవుతుందని మేము అనుకున్నాం. దీంతో మేము మూడు గంటల సినిమా చేయాలని నిర్ణయించుకున్నాం.

Inside the Decision to Make Devara a Two-Part Film

అయితే, షూటింగ్ పూర్తయి, ఎడిటింగ్ పని మొదలైన తర్వాత మా ఎడిటర్ మాతో ‘సర్, ఈ సినిమాను మీరు అనుకున్నంత తక్కువ నిడివిలో కట్ చేయడం చాలా కష్టం. కొన్ని మంచి సన్నివేశాలు మిస్సవుతాయి. కాబట్టి రెండు భాగాలుగా చేయడం మంచిది’ అని సూచించారు. ఆయన సూచన మాకు నచ్చింది” అని కొరటాల శివ తెలిపారు.

Also Read: Lemon Water: ఖాళీ కడుపుతో నిమ్మరసం నీళ్లు తాగితే.. అయితే డేంజర్ లో పడ్డట్టే ?

ప్రస్తుతం ‘దేవర’ సినిమాపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో కటౌట్లకు రక్తాభిషేకాలు చేస్తున్నారు. ఓవర్సీస్‌లో ఈ సినిమా ఇప్పటికే 2 మిలియన్ డాలర్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ సాధించింది.