Will Revanth Reddy Appear in Upcoming Hearing?

Revanth Reddy: ఓటుకు నోటు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్‌కు అప్పటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి డబ్బులు ఇచ్చారని ఆరోపణలు వెలువడ్డాయి. ఈ అంశంపై వీడియోలు వైరల్ అవ్వడంతో, ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత, వారు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు, కానీ ఆయన బెయిల్‌పై తిరిగి వచ్చారు.

Will Revanth Reddy Appear in Upcoming Hearing?

అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే రేవంత్ అరెస్టు సమయంలో రూ. 50 లక్షలతో కూడిన బ్యాగు కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఈ భారీ మొత్తంలో నగదు పట్టుబడడంతో, ఏసీబీ అధికారులు కేసును ఈడీకి తరలించారు. ఆ తరువాత, ఈడీ అధికారులు కూడా విచారణ చేపట్టారు. ఈ కేసులో మరొక నిందితుడు, జెరూసలెం మత్తయ్య, అటు ఏసీబీ, ఇటు ఈడీ విచారణకు హాజరవుతున్నాడు, కానీ మిగతా నిందితులు మాత్రం విచారణకు రాలేదు.

Also Read: Devara: దేవర లో ఊహించని ట్విస్ట్.. ట్రిపుల్ రోల్.. ఎవరంటే?

ఈ రోజు జరిగిన విచారణలో కేవలం మత్తయ్య మాత్రమే హాజరయ్యారు. ఇతర నిందితులు, అంటే రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహ, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ వంటి వారు విచారణకు రాలేదు. దీని కారణంగా, నాంపల్లి కోర్టు ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోర్టు వారందరికీ కీలక ఆదేశాలు జారీ చేస్తూ, తదుపరి విచారణకు తప్పకుండా హాజరుకావాలని స్పష్టం చేసింది.

గతంలో, బీఆర్ఎస్ నేత మరియు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, కానీ కోర్టు ఈ సూచనకు అంగీకరించలేదు. అలాగే, కోర్టు రేవంత్ రెడ్డికి ఈ కేసులో ఎలాంటి జోక్యం చేసుకోవద్దని సూచించింది. ఇప్పుడు, రేవంత్ రెడ్డి మరియు మిగతా నిందితులు వచ్చే నెల 16న కోర్టుకు హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది. వారు హాజరైతే కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్నదానిపై అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.