Kodali Nani: తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రస్తుతం.. లడ్డు కల్తీ అంశం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. తిరుమల శ్రీవారి లడ్డూలో… జంతువుల కొవ్వు కలుపుతున్నారని జగన్ మోహన్ రెడ్డి పై చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. వైసిపి అధికారంలో ఉన్నన్ని రోజులు టీటీడీ లడ్డు… అపవిత్రం అయిందని చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేశారు. Kodali Nani

Kodali Nani counter to chandrababu over Tirumala laddu

అయితే దీనిపై వైసిపి పార్టీ కౌంటర్ ఇస్తూనే ఉంది. కానీ.. దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పై.. వ్యతిరేకత పెరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో…. తిరుమల లడ్డు విషయంలో గట్టిగానే.. కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయింది వైసిపి. ఇందులో భాగంగానే వైసిపి మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా గుండు కొట్టించుకున్నారా ? అలాంటివాడు హిందుత్వం గురించి మాట్లాడుతున్నాడా అని ప్రశ్నించారు కొడాలి నాని. Kodali Nani

Also Read: MUDA case Siddaramaiah: సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ.. కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రి?

తాను దాదాపు 40 సార్లు తిరుమలకు వస్తే 20 సార్లు గుండు కొట్టించుకున్నానని కొట్టాలి నాని తెలిపారు. మహిళలు కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకుని గుండు తీయించుకుంటారని ఆయన వెల్లడించారు. తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ అంశంలో విచారణ చేస్తే అన్ని తేలుతాయని కొడాలి నాని చెప్పడం జరిగింది. Kodali Nani