Divorce: ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్మిళ మతోండ్కర్ తన భర్త మోసిన్ అక్తార్‌తో విడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాలుగు నెలల క్రితం ముంబై కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఊర్మిళ కంటే పదేళ్లు చిన్నవాడైన మోసిన్ అక్తార్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
Urmila Matondkar Files for Divorce from Husband
కానీ, ఈ విడాకుల విషయంలో ఊర్మిళ ఒంటరిగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటి వరకు ఆమె నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఊర్మిళ తన సినీ జీవితం మొదటి నుంచి ప్రేక్షకులను అలరించింది. ‘కర్మ్’ చిత్రంతో బాల నటిగా తెరంగు ప్రవేశం చేసిన ఆమె, తర్వాత తెలుగులో రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘అంతం’ సినిమాతో మన ప్రేక్షకులకు పరిచయమైంది.
Also Read: Mahesh Babu: మహేష్, రాజమౌళి సినిమాలో హీరోయిన్ ఫిక్స్?
‘రంగీలా’, ‘సత్య’ వంటి చిత్రాలతో ఆమె సినీ రంగంలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. కమల్ హాసన్ నటించిన ‘ఇండియన్’ చిత్రంలో కూడా ఆమె నటించి ప్రశంసలు అందుకుంది. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఊర్మిళ, ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనలో చేరి రాజకీయ జీవితంలో కొనసాగుతున్నారు.