Jayam Ravi: తమిళ నటుడు జయం రవి తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించడంతో ఆయన వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలుస్తుంది. ఈ వివాదంలో కెనీషా ఫ్రాన్సిస్ అనే వైద్యురాలు, థెరపిస్ట్ పేరు కూడా అనుకోకుండా వెలుగులోకి వచ్చింది. జయం రవి మరియు కెనీషా మధ్య అక్రమ సంబంధం ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి, ఇది మరింత చర్చలకు కారణమవుతోంది.
Kenisha Francis Denies Affair with Jayam Ravi
ఈ ఆరోపణలను కెనీషా తీవ్రంగా ఖండించారు. ఆమె పట్ల జరుగుతున్న అవాస్తవ ప్రచారంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. జయం రవి తనపై దుర్భాషలాడినట్లు కూడా ఆమె ఆరోపించారు, ఇది ఆమెకు మరింత మానసిక ఒత్తిడి కలిగించిందని చెప్పారు.
Also Read: Jagan Tirumala Visit: తిరుమలలో హైటెన్షన్.. జగన్ రాక డిక్లరేషన్ కోసమేనా!!
ఒక ఇంటర్వ్యూలో కెనీషా, “జయం రవి నా క్లయింట్” అని తెలిపారు. ఆమె వెల్లడించిన దాని ప్రకారం, జయం రవి తన తల్లిదండ్రులను కోల్పోయిన బాధను భరించలేక పోయారని, ఆయన భార్య ఆర్తితో ఉన్న సంబంధం కూడా కష్టమైనదని చెప్పారు. జయం రవి తన సమస్యలను పరిష్కరించడానికి ఆమెను సంప్రదించారని పేర్కొన్నారు.
ఇది కాకుండా, కెనీషా ఆర్తి తనను బలిపశువుగా చేయడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. జయం రవితో తనకు ఎటువంటి శారీరక సంబంధం లేదని, వారి మధ్య స్నేహం మాత్రమే ఉందని స్పష్టం చేశారు. అంతేకాకుండా, జయం రవి తన భార్యకు విడాకులు ఇవ్వాలనే నిర్ణయం తీసుకునే ముందే తనను సంప్రదించలేదని, ఆర్తి కూడా ఈ విషయంపై తెలియకుండా ఉందని ఆమె చెప్పారు. కెనీషా తనపై వస్తున్న ఆరోపణలను తట్టుకోలేక పోతున్నానని వాపోయారు.