Saripoda Sanivaram: నేచురల్ స్టార్ నాని హీరోగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ‘సరిపోదా శనివారం’ సినిమా థియేటర్లలో విడుదలై పెద్దగ ఆకట్టుకోలేదు. ‘దసరా’ మరియు ‘హాయ్ నాన్న’ వంటి సినిమాల తర్వాత, నాని ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా థియేటర్లలో సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరిందని మేకర్స్ ప్రకటించినప్పటికీ, ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ సినిమా కలెక్షన్స్ 90 కోట్ల వరకు మాత్రమే వచ్చాయని అంటున్నారు.
Nani’s Saripoda Sanivaram OTT Faces Mixed Reactions
తాజాగా, ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. థియేటర్లలో చూసే అనుభవం, ఓటీటీలో చూసే అనుభవం భిన్నంగా ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓటీటీలో ప్రేక్షకులు తమకు నచ్చిన సన్నివేశాలను పాజ్ చేసి, మళ్లీ చూసే అవకాశాన్ని వినియోగించుకుంటారు. అయితే, ‘సరిపోదా శనివారం’ ఓటీటీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయిందన్న విమర్శలు వస్తున్నాయి.
Also Read: Devara Cutout: ఎన్టీఆర్ కటౌట్ దగ్ధం.. ఆ హీరో ఫ్యాన్స్ పనేనా.. లేదా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేశారా!!
ప్రేక్షకులు ఎస్.జె. సూర్య నటన, జెక్స్ బిజోయ్ సంగీతం, నాని పెర్ఫార్మెన్స్‌ను ప్రశంసించినప్పటికీ, సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, కథనంలో కొత్తదనం లేకపోవడం కారణంగా రెండో భాగం కొంత లాగ్ అయ్యిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మొత్తం మీద, ‘సరిపోదా శనివారం’ థియేటర్లలో పర్వలేదన్న టాక్ సాధించినప్పటికీ, ఓటీటీలో మాత్రం మిశ్రమ స్పందనను అందుకుంది. నాని ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని ఆస్వాదించినప్పటికీ, సాధారణ ప్రేక్షకులకు సినిమా అంచనాలను తీర్చలేకపోయింది. ఇప్పుడు, నాని అభిమానులు ఆయన తదుపరి చిత్రం ‘హిట్ 3’పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.