Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టి, సినిమా భారీ సక్సెస్ గా నిలిచింది.

Busan International Film Festival Features Kalki 2898 AD

ఇప్పుడు ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్టాత్మకమైన బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. అక్టోబర్ 8 మరియు 9 తేదీల్లో జరగనున్న ఈ ఫెస్టివల్‌లో ‘కల్కి 2898 ఏడీ’ ప్రదర్శించబడుతుంది, దీనికి ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రముఖులు హాజరవుతారు.

Also Read: Saif Ali Khan: దేవర ఫ్లాప్ తరవాత తెలుగు హీరోలపై ‘సైఫ్ అలీఖాన్’ సంచలన వ్యాఖ్యలు!!

ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని వంటి ప్రముఖ నటీనటులు కూడా నటించారు. ప్రభాస్ ఈ సినిమాలో సరికొత్త లుక్‌లో కనిపించడం ప్రేక్షకులను మరింత ఆకర్షించింది. సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణను అందించింది.

బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శింపబోతున్న ఈ సినిమా భారతీయ సినిమాకు మరో గొప్ప గుర్తింపును తెచ్చిపెట్టింది. ‘కల్కి 2898 ఏడీ’ ప్రపంచవ్యాప్తంగా మరింత మంది ప్రేక్షకులను ఆకట్టుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం.