Sobhita Dhulipala: అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల ప్రేమ వివాహం త్వరలో జరగనున్న విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరూ ఇప్పటికే నిశ్చితార్థం జరిపించుకున్నారు. ఇప్పుడు తమ వివాహం ఎలా ఉండాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

Sobhita Dhulipala Discusses Motherhood and Marriage

తాజా ఇంటర్వ్యూలో శోభిత తన వివాహం గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఆమె తెలుగుకు చెందిన సంప్రదాయాలను పాటించి వివాహం చేసుకోవాలని ఆకాంక్షిస్తోంది. ఎంగేజ్‌మెంట్ ఎలాగా జరగాలని అనుకుంటే, అలాగే జరిగిందని చెప్పిన శోభిత, అది ఎంత గ్రాండ్‌గానో, సింపుల్‌గానో జరిగిందనే విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదని స్పష్టం చేసింది.

Also Read: Devara Review: ఎన్టీఆర్ ‘దేవర’మూవీ రివ్యూ!!

తన భవిష్యత్తులో తల్లి అవ్వాలనే కోరిక ఉందని కూడా శోభిత వెల్లడించింది. తాను పెళ్లిలో సంప్రదాయ తెలుపు పట్టు చీర, ఎర్ర అంచుతో కట్టుకుంటానని, పెళ్లి వేడుకలో తెలుగు సంప్రదాయాలు అత్యంత ముఖ్యమని ఆమె చెప్పింది. గతంలో ఈ జంట లండన్‌లో పెళ్లి చేసుకోనున్నారని ప్రచారం జరిగింది, కానీ దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం తెలుగు సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. శోభిత చెప్పినట్లుగా, సంప్రదాయాలను పాటించి వివాహం చేసుకోవాలనే ఉద్దేశం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. జంటకు సంతోషభరితమైన భవిష్యత్తు కోరుతూ, అభిమానులు తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.