Heroine: కన్నడ మీడియాలో ఈ మధ్యకాలంలో పెళ్లి అయ్యాక కూడా చాలామంది హీరోయిన్స్, హీరోలు, నిర్మాతలు వేరే వారితో సహజీవనం చేస్తూ సౌత్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయారు. ఆ మధ్యకాలంలో కన్నడ నటి పవిత్ర లోకేష్ విజయనిర్మల కొడుకు నరేష్ తో సహజీవనం చేస్తూ అడ్డంగా దొరికిపోయి మీడియాలో వైరల్ అయింది.
Producer relationship with Heroine
ఇక ఈ మధ్యకాలంలో దేశం మొత్తాన్ని కుదిపేస్తున్న మరో వార్త ఏంటంటే కన్నడ స్టార్ హీరో దర్శన్ నటి పవిత్ర గౌడతో సహజీవనం.. ఈయన ప్రియురాలి మీద మోజుతో ప్రియురాలికి అసభ్య మెసేజ్లు పంపిస్తున్నాడననే కోపంతో ఓ వ్యక్తిని హత్య చేశాడు. ఇన్ని విషయాలు మీడియాలో వైరల్ అవుతున్న కూడా తాజాగా కన్నడలో మరో మ్యాటర్ వినిపిస్తోంది. (Heroine)
Also Read: Deepika Padukone: దీపికా పడుకొనే మంచి మనసు..ఆ గ్రామాన్ని దత్తత తీసుకొని..!
అదేంటంటే కన్నడ స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న కార్తీక్ గౌడ హీరోయిన్ రమ్యతో ప్రేమలో ఉన్నారని, వీరిద్దరూ లివింగ్ రిలేషన్ లో ఉన్నారంటూ కన్నడ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ రూమర్స్ కి తగ్గట్లుగానే కార్తీక్ గౌడ,రమ్య ఇద్దరు చెట్టా పట్టాలేసుకొని తిరగడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది.
అంతేకాదు ఈ మధ్యకాలంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ కి ఈ జంట కలిసి కనిపించడం వీరి మధ్య రిలేషన్ ఉంది అనేదానికి మరింత ఊతమిచ్చింది. దీంతో కన్నడ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈ జంట గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి వీరి మధ్య నిజంగానే రిలేషన్ ఉందా లేదా అనేది త్వరలో బయటపడుతుంది.(Heroine)