Sakshi Ranga Rao: తెలుగు సినీ పరిశ్రమలో సాక్షి రంగారావు గారు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగివున్నారు. కె. విశ్వనాథ్, బాపు, జంధ్యాల వంటి ప్రముఖ దర్శకుల చిత్రాల్లో ఆయన నటించిన పాత్రలు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాయి. ఇటీవల ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, రంగారావు గారి కుమారుడు శివ, తన తండ్రి జీవితంలోని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

Unheard Stories of Telugu Actor Sakshi Ranga Rao

“నాన్నగారు చేసిన మొదటి చిత్రం ‘సాక్షి’. ఆ సినిమా కారణంగా ఆయన పేరు ఇంటిపేరుగా మారింది. 550కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. ఆ రోజుల్లో పరిశ్రమలో కొత్తవారికి అవకాశాలు చాలా కష్టం. తక్కువ పారితోషకం తీసుకునేవారు, డబ్బు అడిగితే వేషం పోతుందేమోనని భయపడేవారు. ఎంత అనుభవం ఉన్నా, ప్రతి కొత్త పాత్రకు టెన్షన్ పడేవారు. విశ్వనాథ్ గారి సినిమాకు ఛాన్స్ వస్తే, నాన్నగారికి జ్వరం వచ్చేది” అని శివ గారు గుర్తు చేశారు.

Also Read: Tirumala Laddu: లడ్డూ పంచాయితీలో హీరోలు.. తెలివిగా వ్యవహరించిన రజినీ!!

ఆయన తండ్రి ఎంతో కష్టపడి పని చేసినప్పటికీ, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని శివ గారు వివరించారు. “నాన్నగారికి అప్పు చేయడం అంటే భయం. అవసరమైతే చంద్రమోహన్ గారిని మాత్రమే అడిగేవారు. శోభన్ బాబు సలహా మేరకు స్థలాలు కొనాలని చెప్పారు, కానీ నాన్న పెద్దగా పట్టించుకోలేదు. ఆయన చివరికి వదిలిన వారసత్వం ఒక ఇల్లు, కొన్ని లక్షల రూపాయల బ్యాంకు బ్యాలెన్స్ మాత్రమే” అని అన్నారు. సాక్షి రంగారావు గారి జీవితంలో నటనకి ఉన్న ప్రాధాన్యం ఎంతున్నా, ఆర్థిక పరంగా ఆయన అందుకున్నదీ ఎంతో తగ్గింది.