Revanth Reddy: ప్రాంతీయ రింగ్ రోడ్డు దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 వరుసలుగా విస్తరించాలని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయడం జరిగింది ఢిల్లీలో కేంద్రమంత్రి గడ్కరిని రేవంత్ రెడ్డి కలిశారు రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణతో పాటుగా నూతన జాతీయ రహదారుల ప్రకటన గురించి కూడా మాట్లాడారు. అలానే జాతీయ రహదారులుగా ప్రకటించిన మార్గాల పనులు ప్రారంభం తదితర విషయాల గురించి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది.
Revanth Reddy spoke on National highways
సంగారెడ్డి నుండి నర్సాపూర్ తూప్రాన్ గజ్వాల్ గజ్వేల్ జగదేవపూర్ భువనగిరి చౌటుప్పల్ రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించారు. అయితే భూసేకరణకు అయ్యే వ్యయం లో సగభాగాన్ని ప్రభుత్వమే పరుస్తుందని కేంద్రమంత్రికి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు ఈ భాగంలో తమ వంతు పనులు వేగవంతం చేశామని చెప్పారు. అమంగల్ షాద్నగర్ సంగారెడ్డి దాకా రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని కోరారు. దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా చేసి ఈ ఏడాది ఎన్ హెచ్ ఏ ఐ వార్షిక ప్రణాళికలో నిధులు మంజూరు చేయాలని అన్నారు.
Also read: Annapoornamma: ఛాన్స్ ఇస్తా కోరిక తీర్చమనేవారు.. ఎయిడ్స్ రావడంతో భయపడిపోయారు.!
హైదరాబాద్ నుండి వలిగొండ తొర్రూర్ నెల్లికుదురు మహబూబ్ మహబూబాబాద్ ఇల్లెందు కొత్తగూడెం దాకా రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని తెలంగాణ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ వాసులు భద్రాచలం వెళ్లడానికి 40 కిలోమీటర్ల దూరం తగ్గించి రహదారిని జైశ్రీరామ్ రోడ్డుగా వరంగల్ సభలో నితిన్ గడ్కరీ చెప్పారు అదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ గుర్తు చేశారు. ఈ రహదారిలో మిగిలిన మూడు ప్యాకేజీలకు టెండర్లు పిలిపించినందున వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు ఈ సమావేశంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తో పాటుగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు ఉన్నారు (Revanth Reddy).