Naga Babu: మెగా బ్రదర్ నాగబాబు గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నటుడిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. కొన్ని సినిమాల్లో కీలక పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ప్రొడక్షన్ సంస్థను కూడా ఏర్పరిచాడు. ఎప్పుడు బిజీగా ఉండే నాగబాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ గా మారతారు నాగబాబు. Naga Babu

Key Post For Naga Babu In Janasena

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన సమయం నుంచి తన తమ్ముడికి తోడుగా నిలబడ్డాడు. పవన్ కళ్యాణ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇదిలా ఉండగా…. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు మూడు సీట్లు ఖాళీ అయ్యాయి. వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు ,ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావు వారి పదవులకు రాజీనామా చేయడం జరిగింది. వీటిని రాజ్యసభ చైర్మన్ జగదీప్ దనఖడ్ ఆమోదించారు. Naga Babu

Also Read: Harish Rao: రేవంత్ రెడ్డి ఇల్లు కుంటలో ఉంది.. కూల్చేయండి ?

ఎమ్మెల్యేల బలం రిత్యా ప్రస్తుతం అధికారంలో ఉన్న టిడిపి, జనసేన, బిజెపి కూటమికి ఈ మూడు రాజ్యసభ స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఒక సీటు నాగబాబుకు ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. నాగబాబు కేవలం రాజ్యసభ సీటు మాత్రమే కాకుండా కేంద్ర మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగానూ చోటును కల్పిస్తారని అంటున్నారు. ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏకు మద్దతును ఇస్తూ కేబినెట్లో చేరని ఏకైక పార్టీ జనసేననే కావడం గమనార్హం. చివరకు జనసేన వలే ఎంపీ స్థానాలు గెలుచుకున్న జెడిఎస్, కేవలం ఒక్కటే ఎంపీ స్థానం గెలుచుకున్న హిందుస్తానీ అవామ్ మోర్చాలా నుంచి కూడా కేంద్ర కేబినెట్ మంత్రులు ఉన్నారు. Naga Babu