Alia Bhatt: భర్త రణభీర్ కపూర్‌ పుట్టినరోజును పారిస్‌లో ఘనంగా జరుపుకున్న తరువాత, ఆలియా భట్ తిరిగి ఇండియా చేరుకున్నారు. ఆమె ప్రస్తుతం తన రాబోయే చిత్రం ‘జిగ్రా’ ప్రమోషన్ల కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమా అక్టోబర్ 11న విడుదల కానుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

Jigra Actress Alia Bhatt Back in Town

ఈ నేపథ్యంలో ముంబై చేరుకున్న ఆలియా బ్లాక్ జంప్‌సూట్‌లో ఎలిగెంట్‌గా కనిపించారు. ఆమె ధరించిన మ్యాచింగ్ హీల్స్, ఓపెన్ హెయిర్ స్టైల్, హూప్ ఎర్రింగ్స్‌ తో ఆమె తన సహజ సౌందర్యాన్ని మరింత రెట్టింపు చేసింది. పారిస్‌లో గడిపిన చిన్న విరామం ఆమెకు ఎంతో ఫ్రెష్ ఫీలింగ్ ని ఇచ్చిందని స్పష్టంగా కనిపిస్తోంది.

Also Read: Mahesh Babu: ఎన్టీఆర్ దేవర విడుదలై నాలుగు రోజులవుతున్నా మహేష్ మౌనమెందుకు?

ఇక ‘జిగ్రా’ సినిమా కోసం ఆలియా తన వంతు ప్రమోషన్స్ చేస్తుంది. ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సిద్ధమవుతుంది. ఈ సినిమాలో ఆమె పాత్ర మరియు ఆమె నటన ఎంతగానో ప్రేక్షకులను అలరించనుందనే విశ్వాసం అందరిలో ఉంది. ఆలియా భట్ తన అందంతో ఎప్పుడూ ప్రేక్షకుల మనసులు దోచుకుంటున్నారు. ఈ సినిమా ద్వారా ఆమె మళ్ళీ ప్రేక్షకుల ఆదరణ అందుకుంటుందని ఆశిద్దాం. ‘జిగ్రా’ విడుదల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు, మరి ఆమె ఈసారి ఏ స్థాయి ప్రదర్శనతో ముందుకు వస్తారో చూడాలి.