IND vs BAN: టెస్ట్ క్రికెట్ లో బజ్ బాల్ ను ఇంగ్లాండ్ ఏ స్థాయిలో ప్రమోట్ చేసిందో అందరికీ తెలిసిందే. బజ్ బాల్ ను స్థాయిని మించిన క్రికెట్ ను దూకుడైన క్రికెట్ ప్రపంచంలో లేదనే ఫీలింగ్ వారిది. దీనికి సమాధానం టీమిండియా చెప్పింది. ఈ కొత్త టెక్నిక్ ను భారత అభిమానులు గంబాల్ అని పిలుస్తున్నారు. గంభీర్ కోచ్, రోహిత్ శర్మ ఇన్నింగ్స్ లో దూకుడైన కెప్టెన్సీ కలిసి ఈ విధ్వంసాన్ని సృష్టించాయి. IND vs BAN

Gambhir new rules in Team India thats why the bungalow is ruined

లేదంటే వర్షం కారణంగా దాదాపు మూడు రోజులు సరిగ్గా ఆడలేకపోయింది. దీంతో టెస్ట్ మ్యాచ్ లో భారత్ రెండు అంటే రెండు రోజుల లోనే సాధించింది. టెస్ట్ క్రికెట్ లోనే మునుపెన్నడు ఏ జట్టు చూపించలేని అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తూ 8కి పైగా రన్ రేట్ తో మొదటి ఇన్నింగ్స్ లో 285 పరుగులు చేసిన టీమిండియా బంగ్లాదేశ్ ను రెండో ఇన్నింగ్స్ లో 146 పరుగులకే కుప్పకూల్చింది. IND vs BAN

Also Read: IND VS BAN: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో టీం ఇండియా మ్యాచ్.. ఎప్పుడంటే ?

అశ్విన్, రవీంద్ర జడేజా, బూమ్రా మూడేసి వికెట్లతో బంగ్లాదేశ్ పులుల తోక ముడిచేలా చేశారు. ఇక బంగ్లాదేశ్ విసిరిన 95 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి సునాయాసంగా చేదించింది. ఇప్పటికే మొదటి టెస్ట్ గెలిచిన భారత్ ఇప్పుడు అనూహ్యంగా డ్రాగా ముగియాల్సిన రెండో టెస్టును రెండు రోజుల్లోనే చేజిక్కించుకొని 2-0 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. దూకుడైన టెస్ట్ క్రికెట్ కు భారత్ కూడా సరికొత్త నిర్వచనం చెప్పినట్లు అయింది. IND vs BAN