Naga Babu: కొణిదెల నాగబాబు అంటే అందరికీ తెలిసిన పేరే..ఈయన సినిమాల్లో రాజకీయాల్లో బుల్లితెరపై ఎక్కడైనా సరే సూపర్ యాక్టివ్ గా ఉంటారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఫుల్ మెజారిటీతో గెలవడంతో ఈయనకు పదవి కూడా వస్తుందని ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఓవైపు సినిమాల్లో చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉండే నాగబాబుకి ఒక భగ్న ప్రేమ కథ ఉందట. మరి ఆయన ఎవర్ని ప్రేమించారు..
Naga Babu Failure love story
ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయారు అనేది చూస్తే.. నాగబాబు పద్మజని పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిది పూర్తిగా పెద్దలు కుదిర్చిన సంబంధమే.. ఇక నాగబాబు టీనేజ్ లో ఉన్న సమయంలో కొంతమంది అమ్మాయిలని ఇష్టపడ్డారట. అయితే అది కేవలం ఈయన తరపున మాత్రమే.. ఆ అమ్మాయిలనుండి ఎలాంటి రెస్పాన్స్ లేదట. (Naga Babu)
Also Read: Tollywood Heroes: టాలీవుడ్ హీరోల బాలీవుడ్ మోజు.. అక్కడే ఎందుకు?
కానీ నాగబాబు ప్రేమించిన అమ్మాయిలు అందరూ తనకంటే అందంలో బాలేని అబ్బాయిలను ప్రేమించే వారట. ఇది చూసి ఈ అమ్మాయిలకి టేస్ట్ లేదు.. నాకంటే వాళ్ళలో ఏం నచ్చిందో ఏమో అంటూ చాలా జెలస్ గా ఫీల్ అయ్యేవారట. అయితే నాగబాబు ప్రేమించిన ఏ అమ్మాయికి కూడా తన ప్రేమ విషయాన్ని చెప్పలేదట.
వాళ్లు నాగబాబుని తిరిగి చూడడంతో భయంతో పరిగెత్తుకుంటూ వెళ్లేవారట.అలా తన ప్రేమ విషయాన్ని బయట పెట్టడానికి ధైర్యం చాలలేదంటూ తన కూతురు నిర్మించిన కమిటీ కుర్రాళ్ళు సినిమా 50 రోజుల వేడుకల్లో భాగంగా ఈ విషయాలన్నీ ఆ ఈవెంట్ లో పంచుకున్నాడు.(Naga Babu)