Google: మనకి తెలియని వాటిని మనం గూగుల్ లో వెతుకుతూ ఉంటాము. గూగుల్ జీవితంలో ఒక భాగం అయిపోయింది. చేతిలో స్మార్ట్ఫోన్ ఉంది కదా అని గూగుల్లో ఏది పడితే అది వెతుకుతూ ఉంటాం. అయితే ఒకసారి కొన్ని వాటిని సెర్చ్ చేయడం వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందట. టెక్ నిపుణులు ఇటువంటి వాటిని గూగుల్లో సెర్చ్ చెయ్యొద్దని అంటున్నారు. కొన్ని రకాల అంశాల గురించి గూగుల్ సెర్చ్ చేస్తే దానిని నేరంగా పరిగణించి మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయని మీకు తెలుసా..?

Do not search these in Google

గూగుల్ జీవితంలో భాగం అయిపోయినప్పటికీ వీటిని అస్సలు వెతకొద్దు గూగుల్ సెర్చ్ చేయకూడని వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో చిన్నారులపై అఘాయాత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం చిన్నారుల విషయం లో స్ట్రిక్ట్ గా వుంది. గూగుల్ సెర్చ్ లో చిన్నారుల అశ్లీల చిత్రాలకు సంబంధించి ఏదైనా సెర్చ్ చేస్తే అది చట్ట విరుద్ధం. ఇటువంటి చిత్రాలను సెర్చ్ చెయ్యకూడదు. జైలుకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. అలాగే గూగుల్ లో సెర్చ్ చేయకూడని ఇంకో అంశం బాంబును ఎలా తయారు చేయొచ్చు అని. కొంతమంది తమకు అవసరంలేని అంశమైనా సరదాగా వెతుకుతూ ఉంటారు ఇలాంటివి చూడకూడదు.

Also read: Kalki 2898 AD: కల్కి సినిమాలో వీళ్ళ నటన అదుర్స్..!

నిఘా వర్గాలు ఇలాంటి వారి కోసం సెర్చ్ చేసే వాళ్లపై ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుతాయని మర్చిపోవద్దు. అలానే అబార్షన్ కు సంబంధించి కొన్ని నిర్దిష్ట చట్టాలు ఉన్నాయి. నిర్ణీత సమయం తర్వాత డాక్టర్ను సంప్రదించకుండా గర్భస్రావం చేసుకోవడం అనేది భారత చట్టాల ప్రకారం నేరం కనుక గూగుల్ అబార్షన్స్ కి సంబంధించిన వాటి గురించి సెర్చ్ చేయొద్దు. అలానే గూగుల్ సెర్చ్ చేయడమే కాదు కొన్ని రకాల కంటెంట్ అప్లోడ్ చేసే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఇతరుల ప్రైవేట్ వీడియోలను లేదా ఫోటోలను గూగుల్లో షేర్ చేయడం నేరం ఇలా చేస్తే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక అత్యాచార బాధితురాలు పేరు కూడా ఆమెకు సంబంధించిన వివరాలు సెర్చ్ చేయడం కూడా నేరంగా భావిస్తారు (Google).