Soundarya: సౌందర్య.. తన అందం, అద్భుతమైన నటనతో కోట్లు మందిని ఆకర్షించింది. తనకే సొంతమైన సహజ నటనతో సౌందర్య ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. అయితే, ఒక విషాదకరమైన హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె మన మధ్య నుంచి వెళ్లిపోయింది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ వంటి భాషల్లో నటించిన సౌందర్య ప్రతి పాత్రలోనూ తనదైన ముద్ర వేసింది. సావిత్రి తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు లభించిన అత్యుత్తమ నటిగా ఆమెను ప్రశంసించారు.

Mystery Surrounds Soundarya Wealth

ఆమె మంచితనం, అందం కేవలం తెరపైనే కాదు, నిజజీవితంలోనూ ఆమెకు ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. దురదృష్టవశాత్తు, ఆమె చాలా చిన్న వయసులోనే ఈ లోకం విడిచి వెళ్లడం సినీ ప్రపంచానికి తీరని లోటుగా మారింది. సౌందర్య అకాల మరణం తర్వాత ఆమె సంపాదించిన ఆస్తి ఎవరివారసత్వంగా వస్తుందనే ప్రశ్న చర్చనీయాంశం అయ్యింది. ఆమె భర్త ఆ ఆస్తిని తీసుకున్నాడని, రెండో వివాహం చేసుకున్నాడని వార్తలు వచ్చాయి.

Also Read: Lawrence: రాఘవ లారెన్స్ భారీ సోసియో ఫాంటసీ చిత్రానికి అదిరిపోయే టైటిల్!!

అయితే, సౌందర్య తల్లిదండ్రులు కోర్టుకు వెళ్ళి ఆ ఆస్తిని తమ పేరిట రాయించుకున్నారని తెలుస్తోంది. సౌందర్య తన ఆస్తిలో ఎక్కువ భాగాన్ని తల్లిదండ్రుల పేరిట రాసినట్లు సమాచారం. హైదరాబాద్ శంషాబాద్‌లోని 6 ఎకరాల విలువైన భూమిని సౌందర్య తన తల్లిదండ్రులకు అప్పగించింది. ఆ భూమి ఇప్పుడు కోట్ల రూపాయల విలువ కలిగి ఉంది. ఈ భూమిని సీనియర్ నటుడు మోహన్ బాబు కొనుగోలు చేశాడని వార్తలు వచ్చాయి, అయితే ఆ వార్తల నిజానిజాలు స్పష్టంగా తెలియదు.

సౌందర్య మృతితో తెలుగు చిత్రసీమలో ఒక శూన్యత ఏర్పడింది. ఆమెలాంటి నటి మళ్లీ పుట్టడం చాలా కష్టం. సౌందర్య జీవితం ఇప్పటికీ చాలామందికి స్ఫూర్తిదాయకం., తెలుగు చిత్ర పరిశ్రమకు దొరికిన అపురమైన రత్నం సౌందర్య.