Konda Surekha says its my fault

Konda Surekha: సొంత రాజకీయాల కోసం ప్రతిపక్షం వారిని నిందించడం కోసం అమాయకులైన వారిని బలి చేయడం రాజకీయాలు చేసే వారికి అలవాటే అని మరొకసారి ప్రూవ్ చేసుకుంది కొండా సురేఖ.ఆమె తన సొంత రాజకీయాల కోసం అక్కినేని ఫ్యామిలీని సమంతని మధ్యలోకి లాగి వారి ప్రతిష్టకు భంగం కలిగించింది. ఆడది ఆడదానికే శత్రువు అన్నట్లు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినిమా ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరు స్పందిస్తూ క్షమాపణ చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేశారు.

Konda Surekha says its my fault

ఇక కొండా సురేఖ మాట్లాడిన మాటలు తప్పని ఆమెకి కూడా తెలుసు. కానీ కేవలం ఆమె స్వలాభం కోసం ఈ వ్యాఖ్యలు చేసింది.ఇక ఈమె వ్యాఖ్యలపై నాగార్జున స్పందించి మండిపడ్డారు.అలాగే సమంత కూడా కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించి నా మాజీ భర్త నేను పరస్పర అంగీకారంతోనే డివోర్స్ అనేది తీసుకున్నాము. ఇందులో ఎవరి ప్రమేయం లేదు. నన్ను చిన్న చూపు చూడకండి.. (Konda Surekha)

Also Read: Naga Chaitanya: కొండా సురేఖ వ్యాఖ్యలపై సీరియస్ అయిన చైతు.. ఘాటుగా సోషల్ మీడియా లో పోస్ట్!!

మీ రాజకీయాల్లో నన్ను బలి చేస్తూ నా పేరు మధ్యలోకి తీసుకురాకండి అంటూ సమంత కూడా స్పందించింది. అయితే సమంత మాటలపై కొండా సురేఖ స్పందిస్తూ.. షాకింగ్ ట్విట్ చేసింది.క్షమించండి మిమ్మల్నితప్పుగా చిత్రీకరించాలి అనేది నా వాదన కాదు. మిమ్మల్ని నేను చాలా ఇన్స్పైరింగ్ గా తీసుకుంటాను. అంతకంటే ఎక్కువ గౌరవం కూడా ఉంది.

Konda Surekha says its my fault

కానీ ఓ రాజకీయ నాయకుడికి మహిళల పట్ల ఉన్న చిన్నచూపుని ప్రశ్నించడం కోసమే నేను ఈ మాటలు మాట్లాడాను.మీ మనోభావాలను దెబ్బతీయడం కోసం నేను ఈ మాటలు మాట్లాడడం లేదు.నా మాటల కారణంగా మీరు మనస్థాపానికి గురైనట్టయితే ఖచ్చితంగా నేను ఆ మాటలను వెనక్కి తీసుకుంటాను అంటూ కొండా సురేఖ స్పందించింది.(Konda Surekha)