Revanth Reddy reaction on Konda surekha comments

Revanth Reddy: కొంతమంది రాజకీయ నాయకులు తమ నీచ రాజకీయాలను కాపాడుకోవడం కోసం ఎంతటి నీచ రాజకీయాల కోసం అయినా వెనకాడరు. అలా తాజాగా కొండా సురేఖ ప్రవర్తన చూస్తే అలాగే అనిపిస్తుంది అంటున్నారు చాలామంది ఈమె మాటలు విన్న జనాలు.దుబ్బాక సభలో రఘునందన్ రావుకి తనకి ముడి పెడుతూ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వాళ్లు నీచమైన కామెంట్స్ చేశారు అని చెప్పుకొని ఏడ్చిన మంత్రి సురేఖ అక్కినేని ఫ్యామిలీ పై సమంత పై ఇలాంటి మాటలు మాట్లాడడం సరికాదు

Revanth Reddy reaction on Konda surekha comments

అని ఒక మహిళ అయి ఉండి మరో మహిళ జీవితం పై ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికావు అని, ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది జనాలు ఆమెపై మండిపడుతున్నారు.సమంతకు మద్దతుగా నిలుస్తున్నారు.దీనిపై అమల, నాగార్జున, సమంత, నాగచైతన్యలు కూడా స్పందించి సురేఖకి గట్టి కౌంటర్ ఇచ్చారు. కొండా సురేఖ పై మంత్రి సీతక్క కూడా ఫైర్ అయ్యి సినిమా వారిని మధ్యలోకి తీసుకురావద్దు అని మాట్లాడింది. (Revanth Reddy)

Also Read: Konda Surekha: బుద్దొచ్చింది.. తప్పు నాదే అంటున్న కొండా సురేఖ..?

అయితే ఇప్పటివరకు కొండా సురేఖ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి అయితే స్పందించలేదు.అయితే గతంలో రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ ని నిందించడం కోసం సమంతని,అక్కినేని ఫ్యామిలీని మధ్యలోకి లాగారు..కానీ ఇంత ఘాటు వ్యాఖ్యలు అయితే చేయలేదు.మరి ఇప్పుడు మహిళా మంత్రి కొండా సురేఖ మాటలపై రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారు అనేది ప్రతి ఒక్కరు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

Revanth Reddy reaction on Konda surekha comments

ఇక కొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీలు అయితే సురేఖని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.అక్కినేని అభిమానులతో పాటు సమంత అభిమానులైతే కొండా సురేఖని మంత్రి పదవి నుండి తీసేయాలని,ఒక బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం ఏంటి.. ఆమెను మంత్రి పదవి నుండి తప్పించాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నారు. మరి చూడాలి కొండా సురేఖ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుందో.(Revanth Reddy)