Ram Gopal Varma Slams Minister for Controversial Remarks

Ram Gopal Varma: సమంత మరియు నాగ చైతన్య విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర సంచలనం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలను కఠినంగా ఖండిస్తూ, ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కొండా సురేఖపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

Ram Gopal Varma Slams Minister for Controversial Remarks

నాగార్జున కుటుంబాన్ని అవమానించిన కొండా సురేఖ వ్యాఖ్యలపై వర్మ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. “నాగార్జున, నాగ చైతన్య, సమంత లాంటి డిగ్నిఫైడ్ కుటుంబాన్ని, ఇండస్ట్రీలో గర్వపడేలా ఉన్న మహానటిని అనగా సమంత మీద ఇలా నీచమైన మాటలు ఎలా మాట్లాడవచ్చు?” అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Also Read: konda Surekha: కొండా సురేఖ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. లీగల్ గా వెళ్తున్నఅక్కినేని కుటుంబం.. వేలకోట్లు జరిమానా!!

ఇక సమంత గురించి మాట్లాడుతా.. కొండాసురి గారు సమంతాకి అపాలజీ చెప్పడం అనేది అంతకన్నా స్టుపిడిటీ అయితే చూడలేదు. ఫస్ట్ అఫ్ ఆల్ సమంతాని ఎక్కడ అవమానించారు? ఆమె ఇంకా అవమానించలేదు పొగిడారు.
అక్కడ ఏమంటున్నారు ఆవిడ నాగార్జున నాగచైతన్య ఇద్దరు కలిసి ఒక ఒక మామగా ఒక భర్తగా ఒక కోడలిని ఒక భార్యని తనుకున్న ఒక ఆస్తి కాపాడుకోవడానికి వెళ్లమని ఫోర్స్ చేస్తే తను కాదని చెప్పి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది అక్కడ సమంతకు అవమానం ఏంటి? సమంతని పొగిడినట్లే.. యాక్చువల్ గా అవమానించింది ఎవరిని నాగార్జుని చైతన్యని.. అన్నారు.

అక్టోబర్ 1న జరిగిన ప్రెస్ మీటింగ్లో కేటీఆర్‌ను దూషించే క్రమంలో అక్కినేని కుటుంబాన్ని అవమానించడానికి అర్థం లేదని వర్మ ప్రశ్నించారు. “రఘునందన్ ఇష్యూలో నాగార్జున కుటుంబాన్ని లాగడం ఏమిటి?” అని ఆయన అన్నారు. గతంలో, రామ్‌గోపాల్ వర్మ కొండా అనే పేరుతో మంత్రి కొండా సురేఖ భర్త మురళి బయోపిక్ తీసిన విషయం తెలిసిందే. దాంతో, ఆయన ఈ సున్నితమైన అంశంపై ఈ విధంగా తీవ్రంగా స్పందించడం గమనించదగినది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు, తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.