Devara Breaks Records: కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘ఆచార్య’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్‌గా మారిన విషయం తెలిసిందే. ఆ తర్వాత, జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి చేస్తున్న ‘దేవర’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ‘ఆచార్య’ ఫలితాన్ని దృష్టిలో ఉంచుకొని, ఎన్టీఆర్ అభిమానులు కొంత ఆందోళనలో ఉన్నారు.

Jr NTR Devara Breaks Records After Acharya Flop

అయితే, ఎన్టీఆర్ కొరటాల శివపై నమ్మకం ఉంచి, ‘దేవర’ను రెండు సంవత్సరాల పాటు శ్రద్ధగా రూపొందించారు. ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదలై, ప్రేక్షకులను అలరించింది. ప్రారంభంలో మిశ్రమ స్పందన వచ్చినా, తర్వాత సినిమాపై ప్రేక్షకుల ఆదరణ పెరిగింది.

Also Read: Vijay: ఆ కాంట్రవర్సీ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాల్సిన విజయ్.. కానీ ఎక్కడ చెడిందంటే.?

ఎన్టీఆర్ అద్భుతమైన నటన మరియు అనిరుధ్ రవిచందర్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలు కావడం విశేషం. ‘దేవర’ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా మంచి వసూళ్లు సాధించింది. విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 172 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా, ఆరు రోజుల్లోనే రూ. 396 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ముఖ్యంగా సీడెడ్ ప్రాంతాల్లో ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది.

‘దేవర’ విజయానికి ఎన్టీఆర్ స్టార్‌డమ్ ప్రధాన కారణమని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘ఆచార్య’ ఫ్లాప్ అయినా, ఎన్టీఆర్‌పై ప్రేక్షకులకు ఉన్న నమ్మకం ఈ సినిమాను భారీ విజయానికి దారితీసిందని చెప్పవచ్చు.