Revanth Reddy: మూసీ నిర్వాసితుల పోరాటం మరోసారి జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు కారణంగా ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించగా వారిలో కొంతమంది నిర్వాసితులు కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం చేసిన కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని, ఇళ్లు ఇంకా తమకు అందలేదని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో, వారి తరఫున వాదిస్తున్న ఒక లాయర్‌పై పోలీసులు అనుమానాస్పదంగా దాడి చేయడం కలకలం రేపింది.

Revanth Reddy: Moosi Displaced Residents Face New Challenges

న్యాయ వ్యవస్థపై ఇటువంటి దాడులు జరుగడం పట్ల లాయర్ల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయాన్ని సాధించేందుకు పోరాడుతున్న లాయర్‌పై దాడి జరగడం చట్ట విరుద్ధమని, దీనిని ఒక రకమైన అణచివేత చర్యగా భావిస్తున్నారు. ఈ సంఘటనపై లాయర్ల సంఘం తీవ్రంగా స్పందిస్తూ, దాడి చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోర్టు ముందు నిరసన ప్రదర్శనకు దిగారు.

Also Read: Devara: దేవర సినిమా నే నిరాశను కలిగించింది.. ఇక దేవర 2 ఉండదేమో!!

మూసీ నిర్వాసితుల సమస్యలు ఇంతటితో ఆగిపోకూడదు. ఇళ్లు కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం తక్షణమే ఈ ఘటనపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. పోలీసుల నిరంకుశ చర్యలను ఖండిస్తూ, బాధ్యులను సస్పెండ్ చేయాలని సమాజంలోని వివిధ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ సంఘటన ప్రజాస్వామ్యంలో అణచివేత చర్యలపై విస్తృత చర్చకు దారితీసింది. న్యాయం కోసం పోరాడేవారిపై అణచివేజరగడం సరికాదని, ప్రతి ఒక్కరూ ఈ సంఘటనపై స్పందించి, బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని పిలుపునివ్వాల్సిన అవసరం ఉంది.