Alpha: బాలీవుడ్ క్వీన్ అలియా భట్ వరుస విజయాలతో దూసుకుపోతూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న యాక్షన్ ప్యాక్డ్ చిత్రం ‘జిగ్రా’ 2024 అక్టోబర్ 11న విడుదల కానుంది. తెలుగు సహా పలు భాషల్లో ఈ సినిమా విడుదల అవుతోంది, మరియు దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Alia Bhatt Leads YRF First Female Spy Film Alpha

‘జిగ్రా’ రిలీజ్ కాకముందే, అలియా తన తదుపరి ప్రాజెక్ట్ ‘ఆల్ఫా’ కోసం ప్రిపరేషన్స్ ప్రారంభించేశారు. శివ రావైల్ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘యాష్ రాజ్ ఫిల్మ్స్’ స్పై యూనివర్స్‌లో మహిళా కథానాయిక ఆధారిత తొలి చిత్రం కావడం విశేషం. ఈ భారీ బడ్జెట్ చిత్రం 2025 డిసెంబర్ 25న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

Also Read: Devara: మళ్ళీ పుంజుకున్న దేవర కలెక్షన్స్.. వెయ్యి కోట్లు టార్గెట్!!

ఈ చిత్రంలో అలియాతో పాటు శర్వరి కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆదిత్య చోప్రా నిర్మాణంలో రూపొందుతున్న ‘ఆల్ఫా’ ఈ ఏడాది అత్యంత ఆసక్తికర చిత్రంగా మారనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. తాజా ప్రాజెక్ట్స్‌తో అలియా భట్ తన ఫ్యాన్ బేస్‌ను మరింత విస్తరించుకుంటోంది. ‘జిగ్రా’ తర్వాత ‘ఆల్ఫా’ సినిమాతో కూడా ఆమె బాక్సాఫీస్‌ను మరోసారి దూసుకుపోతారని, ప్రేక్షకుల్ని కొత్తరకం పాత్రలతో మళ్లీ అలరిస్తుందని ఆశిద్దాం.