KTR Questions Revanth: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సంచలన ట్వీట్ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చేసిన ప్రకటనపై స్పందిస్తూ, సీఎం రేవంత్ రెడ్డి అసలు బండారం బయటపడిందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రకారం, తెలంగాణలో రైతులకు ఆగస్టు 15లోపు 2 లక్షల మేర రుణమాఫీ పూర్తిచేశామంటూ సీఎం రేవంత్ రెడ్డి చెబుతూ, కానీ చాలా మందికి రుణమాఫీ రాలేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో, రుణమాఫీపై నెలకొన్న గందరగోళం మంత్రి నాగేశ్వర రావు వ్యాఖ్యలతో మరోసారి చర్చకు నిలిచింది.

KTR Questions Revanth Loan Waiver Claims on Twitter

“20 లక్షల మందికి రుణమాఫీ కాలేదని వ్యవసాయ మంత్రి ప్రకటనతో సీఎం బండారం బట్టబయలైంది. వందశాతం రుణమాఫీ పూర్తిచేశామని చెప్పిన ముఖ్యమంత్రివారి మాటలు కేవలం డొల్లమాటలేనని మరోసారి తేలిపోయింది. ఓవైపు డిసెంబర్ 9న ఏకకాలంలో మోసం చేస్తామని చెప్పడం, మరోవైపు 10 నెలలైనా 20 లక్షల రైతులకు మోసం జరుగుతుండడం అనేది గందరగోళం” అని కేటీఆర్ అన్నారు.

Also Read: TTD: తిరుమల కు ఏమైంది.. మరో అపశకునం..టీటీడీ క్లారిటీ!!

ఈ నేపథ్యంలో, తెలంగాణలో 22 లక్షల పైగా రైతులకు రుణమాఫీ పూర్తయ్యిందని, ఇంకా 20 లక్షల మంది రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచేందుకు రుణమాఫీ చేస్తామంటూ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు. అయితే, బీజేపీ నేతలు మరియు బీఆర్ఎస్ నాయకులు రైతుల్లో గందరగోళం సృష్టించడంపై మంత్రి మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని, దాంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంటోందని తెలిపారు.