Arjun Sarja: అర్జున్ సార్జా నిజంగానే లవ్ ఫెయిల్యూరా.. ఆయన నటి నివేదిత రథసప్తమిని ప్రేమించే కంటే ముందే మరో హీరోయిన్ ని గాఢంగా ప్రేమించారా..ఇంతకీ అర్జున్ సార్జా ప్రేమించిన ఆ అమ్మాయి ఎవరబ్బా అనేది ఇప్పుడు చూద్దాం. అర్జున్ ప్రేమించింది ఎవరినో కాదు ప్రస్తుతం బామ్మ క్యారెక్టర్స్ చేస్తూ సీరియల్స్ లో సినిమాల్లో దూసుకుపోతున్న నటీ నళినిని.
Arjun Sarja failure love
అవును మీరు వినేది నిజమే. ఇప్పుడైతే నళిని ఇలా లావుగా తయారయ్యింది.కానీ ఒకప్పుడు ఆమె చాలా బ్యూటిఫుల్ గా ఉండేది.ఈమె అమాయకత్వమైన అందానికి ఎంతోమంది ఫిదా అయ్యారు.అలా అప్పట్లో ఎన్నో సినిమాల్లో నటించిన నళిని ని అర్జున్ ఇష్టపడ్డారట.కానీ ఈ విషయం నళినీకి చెప్పకపోవడం అర్జున్ చేసిన పెద్ద తప్పు.. (Arjun Sarja)
Also Read: Jr. NTR: Jr.ఎన్టీఆర్ నాశనం కోరుకుంటున్న హరి.. ఇంతకీ ఈ హరి ఎవరంటే.?
తన లవ్ విషయాన్ని చెప్పకపోవడానికి ఓ కారణం ఉందట. అదేంటంటే.. హీరోయిన్ నళిని అప్పటికే డైరెక్టర్ రామరాజన్ తో ప్రేమలో ఉందట. అయితే ఈ ప్రేమ విషయం తెలిసి అర్జున్ ఎంతో బాధపడి తన ప్రేమ విషయాన్ని దాచిపెట్టారట. కానీ ఇండస్ట్రీలో ఉన్న కొంత మందికి ఈ విషయం తెలియడంతో దీన్ని మొత్తం ప్రచారం చేశారట.అయితే అదే సమయంలో నళిని రామరాజన్ ల పెళ్లి కూడా జరిగింది.
ఇక వీరి పెళ్లి సమయంలో అర్జున్, నళినిని ప్రేమించారంటూ వార్తలు వినిపించినప్పటికీ దీన్ని ఎక్కువగా పట్టించుకోలేదు. ఇక నళిని ని ప్రేమించి పెళ్లి చేసుకున్న డైరెక్టర్ రామరాజన్ తో ఎక్కువ సంవత్సరాలు ఉండలేదు. వీరి మధ్య గొడవలు రావడంతో విడాకులు తీసుకున్నారు.ఇక అర్జున్ తనతో నటించిన హీరోయిన్ నివేదిత ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.(Arjun Sarja)