Megastar in Prabhas movie

Prabhas: ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా మూవీస్ తో బిజీబిజీగా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే.కల్కి హిట్ తో మళ్ళీ ప్రభాస్ మానియా బాక్సాఫీస్ వద్ద మొదలైపోయింది. ప్రభాస్ థియేటర్లోకి వస్తున్నాడు అంటే ఆ థియేటర్లలో గోలగోల ఉంటుంది. అలాగే నిర్మాతలకి కలెక్షన్ల వర్షం కూడా కురిపిస్తాడు. అయితే అలాంటి ప్రభాస్ చేతిలో కల్కి టు, సలార్ -2 సీక్వెల్స్ తో పాటు ది రాజా సాబ్,ఫౌజి,స్పిరిట్ సినిమాల్లో చేస్తున్నారు.

Megastar in Prabhas movie

అయితే స్పిరిట్ సినిమాకి ఇప్పుడప్పుడే డేట్స్ ఇచ్చేలా కనిపించడం లేదు ప్రభాస్. ఎందుకంటే ప్రస్తుతం ది రాజా సాబ్, ఫౌజీ సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ స్పిరిట్ సినిమా కోసం అంచనాలు పెంచేస్తున్నారు సందీప్ రెడ్డి వంగ.అదేంటంటే ప్రభాస్ సినిమాలో మెగాస్టార్ ని తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది(Prabhas)

Also Read: Arjun Sarja: అర్జున్ సార్జా ఫెయిల్యూర్ లవ్.. ఆ హీరోయిన్ ని గాఢంగా ప్రేమించారా..?

ఇప్పటికే ప్రభాస్ స్పిరిట్ మూవీలో బాలీవుడ్ కపుల్ అయినటువంటి సైఫ్ అలీ ఖాన్, కరీనాకపూర్ లు నటిస్తున్నారని టాక్ వినిపించింది. అయితే తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో రూమర్ వినిపిస్తోంది. అదేంటంటే ప్రభాస్ స్పిరిట్ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టిని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ రూమర్ గురించి చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వక పోయినప్పటికీ ప్రస్తుతం సినీ వర్గాల్లో మాత్రం ఈ వార్త తెగ చక్కర్లు కొడుతోంది.

Megastar in Prabhas movie

ఇక 400 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీ స్టోరీ నే సరికొత్తగా ఉంటుంది అని సందీప్ రెడ్డి వంగ అంచనాలు పెంచేశారు.. ఇక సినీ వర్గాల్లో ఈ రూమర్ వినిపించడంతో ప్రభాస్ ఫ్యాన్స్ లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇక స్పిరిట్ సినిమాకి సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ నడుస్తోంది.ఈ సినిమా షూటింగ్ వచ్చే సంవత్సరం మొదలవుతుంది.(Prabhas)