Jr.NTR: ఏంటి జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ ని ఆ విషయంలో అంత పెద్ద మోసం చేసిందా.. ఆమె ఓ అబద్ధాల కోరా.. అయితే ఈ విషయం వింటే చాలామంది ఎన్టీఆర్ అభిమానులకు కోపం వస్తుంది ఏమో కానీ ఈ మాటలు స్వయంగా ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో అన్నవే.. మరి ఎందుకు ఎన్టీఆర్ తన భార్య గురించి అలా అన్నారు అనేది ఇప్పుడు చూద్దాం..
Has Lakshmi Pranathi cheated Jr.NTR
ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతిని అబద్దాల కోరు అని చెప్పడానికి కారణం తమ మొదటి బాబు అభయ్ రామ్ పుట్టిన సమయంలో ఎన్టీఆర్ కి అబద్దం చెప్పి హాస్పిటల్ కి వెళ్ళిందట లక్ష్మి.. ఇక అసలు విషయం ఏమిటంటే.. ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి తమ మొదటి బిడ్డకు ఆహ్వానించే సమయంలో ఎన్టీఆర్ అవుట్ డోర్ షూటింగ్లో ఉన్నారట. ఈ షూటింగ్లో ఉన్నప్పుడు 9 నెలల గర్భవతిగా ఉన్న లక్ష్మీ ప్రణతి దగ్గర షూటింగ్ కి వెళ్లే ముందు ఒక మాట తీసుకున్నారట ఎన్టీఆర్. (Jr.NTR)
Also Read: Jr. NTR: Jr.ఎన్టీఆర్ నాశనం కోరుకుంటున్న హరి.. ఇంతకీ ఈ హరి ఎవరంటే.?
నేను వచ్చే వరకు నువ్వు మన మొదటి బిడ్డకు జన్మనివ్వకూడదు.నేను లేకుండా నువ్వు బిడ్డను కనకూడదు అని గట్టిగా చెప్పి వెళ్లారట.. ఇక షూటింగ్ ముగించుకొని వచ్చేలోపే లక్ష్మీ ప్రణతి హాస్పిటల్ కి వెళ్ళిందట. అయితే ఎన్టీఆర్ గుడ్ లక్ ఏంటంటే..షూటింగ్ అయిపోయి హైదరాబాద్ కి వచ్చిన రోజు ఉదయాన్నే ఎన్టీఆర్ లక్ష్మి కి ఫోన్ చేస్తే నార్మల్ చెక్ అప్ కోసం డాక్టర్ రమ్మంటే హాస్పటల్ కి వెళ్తున్నాను అని లక్ష్మీ ప్రణతి అబద్దం చెప్పిందట.
అప్పటికే అనుమాన పడుతున్న ఎన్టీఆర్ నిజం చెప్పు అనగా అదేమీ లేదు అని చెప్పిందట. ఆ తర్వాత ఎన్టీఆర్ ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అవ్వడంతోనే హాస్పిటల్ నుండి తల్లి శాలిని ఫోన్ చేసి వెంటనే ఇక్కడికి వచ్చేయ్ అనడంతో అప్పటికే ఎన్టీఆర్ కి పూర్తి మేటర్ అర్థమైందట. ఇక ఎన్టీఆర్ హాస్పిటల్ కి వెళ్ళి సైన్ చేసేలోపే ఆపరేషన్ థియేటర్లో అభయ్ రామ్ జన్మించారు. అలా మొదటి కొడుకు పుట్టిన సమయంలో అబద్ధం చెప్పి లక్ష్మీ ప్రణతి నన్ను మోసం చేసింది అంటూ ఎన్టీఆర్ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.(Jr.NTR)