Ranganath VS Amrapali: తెలంగాణలో హైడ్రా గురించి చర్చలు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి. చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాల కూల్చివేత కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం, ఇప్పుడు రాజకీయ చర్చలకు నాంది పలుకుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాకు అదనపు అధికారాలు కల్పించడానికి ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావడంతో, జీహెచ్ఎంసీ కమిషనర్ మరియు కలెక్టర్ లకు ఉన్న అధికారాలు కూడా హైడ్రాకు వర్తించనుంది. ఈ పరిణామంతో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ముఖ్యంగా మూసీ నది పునరుద్ధరణ పేరుతో తమ భూములు, ఇళ్లు కోల్పోతామన్న భయంతో.

Ranganath VS Amrapali: HMC Officials Express Concerns over Diminished Role

అయితే, సీఎం రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. గతంలో హైకోర్టు హైడ్రా చట్టబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తినా, తాజా ఆర్డినెన్స్ తో ఆ సమస్యలు పరిష్కారమైనట్లు తెలిపారు. హైడ్రా వివాదం రాజకీయ నాయకుల మధ్యనే కాకుండా, అధికారులు మధ్య కూడా తీవ్ర చిచ్చు రేపుతోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హైడ్రాపై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.

Also Read: Hyderabad: హైదరాబాద్ వాసులకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. అందరూ వినియోగించుకోవాలని!!

జీహెచ్ఎంసీ విజిలెన్స్ విభాగం నుంచి కొంతమంది సిబ్బందిని హైడ్రాకు కేటాయించగా, వారు జీహెచ్ఎంసీ నుంచే జీతాలు తీసుకుంటున్నారు. ఈ విషయంపై ఆమ్రపాలి అభ్యంతరం వ్యక్తం చేస్తూ, సిబ్బందిని తిరిగి జీహెచ్ఎంసీకి పంపించాలని రంగనాథ్ కు లేఖలు రాశారు. కానీ, రంగనాథ్ లేఖలపై స్పందించకపోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీంతో, ఆమ్రపాలి జీహెచ్ఎంసీ ఉద్యోగులకు డెడ్ లైన్ విధించి, విధుల్లో చేరకపోతే జీతాలు నిలిపేస్తామనే హెచ్చరిక చేశారు. ఈ వివాదం రెండు కమిషనర్ల మధ్య వార్ లాగా మారడం జీహెచ్ఎంసీ అధికారులకు అసంతృప్తి తెచ్చింది.