Duvvada Srinivas: తిరుమల శ్రీవారి సన్నిధిలో… దువ్వాడ శ్రీనివాస్ అలాగే దువ్వెల మాధురి ఇద్దరూ.. ఓవరాక్షన్ చేశారు. సోమవారం రోజున… ఉదయం పూట తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు దువ్వెల శ్రీనివాస్ అలాగే మాధురి. గత కొన్ని రోజులుగా ప్రేమాయణం నడిపిస్తున్న ఈ ఇద్దరు..తాజాగా తిరుమల సన్నిధిలో మెరవడం జరిగింది. అయితే ఉదయం మొత్తం… శ్రీవారిని దర్శించుకున్న తర్వాత… మధ్యాహ్నమే వివాదంలో చిక్కుకున్నారు. Duvvada Srinivas

Duvvada Srinivas Divvela Madhuri Visits Tirumala

ఏడుకొండల తిరుమల శ్రీవారి సన్నిధిలో… ఫోటోషూట్ కు తెర లేపారు మాధురి. మాడవీధులు అలాగే పుష్కరిణి దగ్గర దువ్వాడ శ్రీనివాస్ తో పాటు… ఫోటోషూట్ చేశారు మాధురి. దువ్వాడ శ్రీనివాస్..డైరెక్షన్లోనే… మాధురి ఇలా చేసిందని విమర్శలు వస్తున్నాయి. అయితే మాధురి చేసిన పనులపై అక్కడే ఉన్న భక్తులు సీరియస్ అవుతున్నారు. తిరుమల సన్నిధిలో.. ఈ రచ్చ ఏందయ్యా అంటూ ఆగ్రహిస్తున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించి.. తిరుమలలో ఫ్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించారట దువ్వాడ శ్రీనివాస అలాగే మాధురి. Duvvada Srinivas

Also Read: Hyderabad: హైదరాబాద్ వాసులకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. అందరూ వినియోగించుకోవాలని!!

ఇప్పుడు ఇదే అంశం హాట్ టాపిక్ అయింది. ఇది ఇలా ఉండగా… గత రెండు నెలలుగా దువ్వాడ శ్రీనివాస్ అలాగే మాధురి ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ అయిన సంగతి… తెలిసిందే. తన భార్య అలాగే పిల్లలను వదిలేసి… మాధురి వెనుక తిరుగుతున్నారు దువ్వాడ శ్రీనివాస్. దీనిపై దువ్వాడ శ్రీనివాస్ సతీమణి దువ్వాడ వాణి కేసు కూడా వేయడం జరిగింది. అయినప్పటికీ మాధురినే పెళ్లి చేసుకుంటానని… దువ్వాడ శ్రీనివాస్ ఇప్పటికే ప్రకటించారు. మాధురి… భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత పెళ్లి చేసుకోబోతున్నారట. Duvvada Srinivas