Shyamaladevi who gave Prabhas a wedding date

Prabhas: ప్రభాస్ పెళ్లికి రెడీ అయ్యారా.. శ్యామల దేవి చెప్పిన మాటలు నిజమేనా.. ఒకేసారి నలుగురికి పెళ్లిళ్లు చేయబోతుందా? ఇంతకీ శ్యామలా దేవి ఏం చెప్పిందో ఇప్పుడు చూద్దాం..దివంగత నటుడు కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి తాజాగా విజయవాడ కనకదుర్గను సందర్శించింది. ఇక దేవతను సందర్శించుకుని బయటికి వచ్చే సమయంలో కొంతమంది మీడియా వాళ్ళు శ్యామలా దేవితో మాట్లాడారు.

Shyamaladevi who gave Prabhas a wedding date

ఇందులో భాగంగా శ్యామలా దేవి కుంకుమ పూజ చేయించుకున్నానని పూజారులు, ఈవో చాలా బాగా సహకరించారని,కనకదుర్గాదేవి అలంకారం చాలా బాగుందని,చండీ రూపంలో కనిపించిందంటూ చెప్పుకొచ్చారు. అలాగే గుడిని కూడా చాలా బాగా అలంకారం చేశారంటూ ఆలయ యాజమాన్యాన్ని మెచ్చుకుంది శ్యామలా దేవి. (Prabhas)

Also Read: Ranganath VS Amrapali: వీరిద్దరి మధ్య చిచ్చు పెట్టిన రేవంత్ రెడ్డి!!

ఇందులో భాగంగా మీరు గత ఏడాది వచ్చినప్పుడు కూడా వచ్చే ఏడాది ప్రభాస్ పెళ్లి అని చెప్పారు.మళ్ళీ ఏడాది గడిచింది.. మరి ఇప్పుడు ప్రభాస్ పెళ్లిపై ఏ విధంగా స్పందిస్తారు అని మీడియా వాళ్ళు అడగగా.. కచ్చితంగా ప్రభాస్ పెళ్లి అతి త్వరలోనే జరుగుతుంది. నా భర్త మీది నుండి అన్ని చూసుకుంటారు.

Shyamaladevi who gave Prabhas a wedding date

నాకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు ఆ ముగ్గురు కూతుర్లకు ముగ్గురు అల్లుళ్ళు వస్తారు నా ఇంటికి కోడలు వస్తుంది. నా కొడుకు ప్రభాస్ త్వరలోనే పెళ్లి చేసుకుంటాడు. ఈ గుడ్ న్యూస్ మీ అందరికీ అతి త్వరలోనే చెబుతాను అంటూ శ్యామలా దేవి చెప్పుకొచ్చింది.(Prabhas)