Nag Ashwin: ప్రస్తుతం దేశం మొత్తం కల్కి 2898 ఏడి మూవీ డైరెక్టర్ అయినటువంటి నాగ అశ్విన్ ని మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు సుకుమార్, రాజమౌళి,సందీప్ రెడ్డి వంగా వంటి డైరెక్టర్లను కొట్టేవారే లేరు అని అనుకున్నారు. కానీ సడన్ గా నాగ్ అశ్విన్ కల్కి పేరిట అతిపెద్ద విజయాన్ని తన ఖాతాలో వేస్తున్నారు. ఎన్నో అంచనాలతో థియేటర్లలో విడుదలైన కల్కి మూవీ అభిమానుల అంచనాలను మించి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
Kalki director Nag Ashwin love story
అయితే ఈ సినిమాలో ప్రభాస్ నటన వేరే లెవెల్ లో ఉందని చెప్పుకోవచ్చు.ఇక ఈ సినిమాకి దర్శకత్వం వహించిన నాగ్ అశ్విన్ క్రియేటివిటీ సూపర్.. అట్రాక్ట్ చేసే విజువల్ ఎఫెక్ట్స్ తో బాక్సాఫీస్ వద్ద భారీ హిట్టు కొట్టారు. అయితే అలాంటి నాగ్ అశ్విన్ గురించి ఓ ఆసక్తికరమైన విషయాలు మీడియాలో చక్కర్లు కొడుతుంది. అందేంటంటే..ఆయన ప్రేమ వివాహం.. నాగ్ అశ్విన్ తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్సే. అయితే ఆయన కూడా డాక్టర్ అవుతారు అనుకున్నప్పటికీ వెరైటీగా సినీ రంగాన్ని ఎంచుకొని సక్సెస్ అయ్యారు. (Nag Ashwin)
Also Read: Kalki 2898 AD Movie: కల్కి 2898AD సినిమా ప్లస్, మైనస్ పాయింట్స్ ఇవే !
అయితే ఈయన భార్య ప్రియాంక దత్ స్టార్ ప్రొడ్యూసర్ అయినటువంటి అశ్విననీ దత్ కుమార్తె.అయితే వీరిద్దరికీ పరిచయం ఎక్కడ ఏర్పడిందంటే.. యాదోం కీ బరాత్ అనే ఇంగ్లీష్ షార్ట్ ఫిలిం తీసిన సమయంలో ఈ షార్ట్ ఫిలిం ప్రియాంక దత్ నిర్మాతగా చేసింది. ఆ తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాకి కూడా ప్రియాంక దత్, స్వప్న దత్ ఇద్దరూ నిర్మాతలుగా చేశారు.అలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అధికాస ప్రేమ వరకు దారితీసింది. అయితే ప్రియాంక దత్ తన ప్రేమ విషయాన్ని నాగ్ అశ్విన్ ఎలా చెప్పారంటే..
మా నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని ప్రియాంక చెప్పిన సమయంలో మీకు ఇష్టమైతే వారిని పెళ్లి చేసుకోండి..లేకపోతే మనమిద్దరం పెళ్లి చేసుకుందాం అంటూ వెరైటీగా ప్రపోజ్ చేసి ప్రియాంకని ఇంప్రెస్ చేశారట. ఇక ఆ ఒక్క మాటతో ప్రియాంక నాగ్ అశ్విన్ మాయలో పడిపోయింది.అలా వీరి ప్రేమ బంధం పెళ్లి బంధంగా మలుచుకున్నారు.ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక బాబు కూడా పుట్టారు. ప్రస్తుతం కల్కి సినిమా హిట్ అవ్వడంతో నాగ్ అశ్విన్ కి సంబంధించిన ఎన్నో వైరల్ వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.(Nag Ashwin)