Poonam Kour: Do you have guts to ask Trivikram

Poonam Kour: చాలా సంవత్సరాల నుండి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సందు దొరికితే చాలు త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ లని ఏకీపారేస్తుంది పూనమ్ కౌర్.. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలో తనకు అవకాశం వచ్చినా త్రివిక్రమ్ వాడుకొని ఆ అవకాశం రాకుండా చేశారు అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. దాంతో కావాలనే త్రివిక్రమ్ ని టార్గెట్ చేస్తూ పూనమ్ కౌర్ మాట్లాడుతుంది.

Poonam Kour: Do you have guts to ask Trivikram

అయితే ఇదే విషయంపై ఎన్నోసార్లు సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టినా కూడా అటు పవన్ కళ్యాణ్ గానీ ఇటు త్రివిక్రమ్ గానీ స్పందించిన దాఖలాలు అయితే లేవు. అయితే తాజాగా పూనమ్ కౌర్ విషయంపై నిర్మాత చిట్టిబాబు మాట్లాడుతూ.. పూనమ్ కౌర్ పిచ్చి మాటలు మాట్లాడుతోంది.ఆమె పిచ్చి పట్టిన దానిలా పోస్టులు పెడుతోంది. ఆమెకు ఏదైనా జరిగితే ఫిలిం ఛాంబర్ లో వచ్చి ఫిర్యాదు చేయాలి. (Poonam Kour)

Also Read: Devara: ఓటీటీలోకి ఎన్టీఆర్ ‘దేవర’.. ఎప్పుడు.. ఎందులో వస్తుందంటే!!

ఇలా లేనిపోని కామెంట్లు పెట్టడం ఎందుకు.. బయటికి వచ్చి చెప్తేనే కదా తెలిసేది అంటూ మాట్లాడారు. అయితే ఈయన మాటలపై పూనమ్ కౌర్ ఫైర్ అవుతూ నిర్మాత గారికి ఈ విషయం తెలియదు కావచ్చు. నేను ఎప్పుడో ఫిలిం చాంబర్లో ఫిర్యాదు చేశాను. కానీ దాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. మీకు త్రివిక్రమ్ ని ప్రశ్నించే దమ్ముందా.. మీకు త్రివిక్రమ్ ని ప్రశ్నించే దమ్ము లేనప్పుడు మాట్లాడకండి.

Poonam Kour: Do you have guts to ask Trivikram

మీకులా నేను వెన్నముక లేని దాన్ని కాదు.. నేను ఎప్పుడో ఫిర్యాదు చేశాను. కానీ దాన్ని పట్టించుకోవడం లేదు. ఎందుకంటే త్రివిక్రమ్ ని అడిగే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు కాబట్టి.నేను ఫిర్యాదు ఇచ్చిన కూడా ఇవ్వలేదని అబద్ధాలు చెబుతూ ఒక మహిళపై ఇలాంటి దారుణమైన కామెంట్లు చేయడం మంచిది కాదు అంటూ పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ చేయడంతో ఈమె ట్వీట్ చూసిన చాలా మంది నెటిజన్స్ చిట్టి బాబుకి పెద్ద పంచ్ పడింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Poonam Kour)