![Prabhas is very weak in that matter](https://telugu.pakkafilmy.com/wp-content/uploads/2024/06/Prabhas-is-very-weak-in-that-matter-1024x576.jpg)
![Prabhas is very weak in that matter](https://telugu.pakkafilmy.com/wp-content/uploads/2024/06/Prabhas-is-very-weak-in-that-matter-1024x576.jpg)
Prabhas: చాలామంది హీరోలు పెళ్లి చేసుకోక పోవడానికి ఏదో ఒక కారణం ఉంటుంది. కొంతమందికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్,మరి కొంత మందికి పెళ్లి పై ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇంకొంతమందికి పెళ్లి అనే బంధం పై నమ్మకం లేకపోవడం ఇక కొంతమంది మొదట్లో లవ్ ఫెయిల్యూర్ కావడం, కొంతమందికి అయితే తమకి నచ్చిన వారు దొరకకపోవడం.. ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి పెళ్లి చేసుకోకపోవడానికి.అయితే ప్రభాస్ కి మాత్రం పెళ్లి కాకపోవడానికి ఆ వీక్నెస్ కారణమట..మరి ఇంతకీ ప్రభాస్ కి ఉన్న వీక్నెస్ ఏంటో ఇప్పుడు చూద్దామా..
Prabhas is very weak in that matter
ప్రభాస్ కి ఉన్న వీక్నెస్ అంటే అంతా వేరే వేరే ఏదో ఊహించుకుంటారు. కానీ మీరు అనుకున్న ఊహగాణాలు అన్ని తప్పే. ఎందుకంటే ప్రభాస్ కి ఉన్న వీక్నెస్ లు ఏంటంటే.. అతిగా మాట్లాడకపోవడం, తొందరగా ఎవరితోనూ కలవకపోవడం, అన్నింటికీ మించి బద్ధకం ఎక్కువ.. ఈ మూడు వీక్నెస్ ల కారణంగానే ఆయన ఇప్పటివరకు పెళ్లి చేసుకోవడం లేదట.ఇక ఈ విషయాన్ని స్వయంగా ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ( Prabhas )
ఆయన మాట్లాడుతూ..నాకు ఎవరైనా తెలియని వారితో మాట్లాడాలంటే చాలా భయం. వారితో తొందరగా కలిసి పోలేను. మొహమాటం ఎక్కువగా ఉంటుంది.అలాగే సినిమాల్లో కెమెరా ముందు యాక్టింగ్ చేస్తాను కానీ స్టేజ్ ఎక్కి మైక్ ఇచ్చి మాట్లాడమంటే అస్సలు మాట్లాడలేను. మాటలు తడబడతాయి. స్టేజ్ ఫియర్ ఎక్కువగా ఉంటుంది.వీటన్నింటికీ మించి నాకు బద్ధకం ఎక్కువ అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చారు.
![Prabhas is very weak in that matter](https://telugu.pakkafilmy.com/wp-content/uploads/2024/06/Prabhas-1024x576.jpg)
![Prabhas is very weak in that matter](https://telugu.pakkafilmy.com/wp-content/uploads/2024/06/Prabhas-1024x576.jpg)
ఇక ఇదే విషయాన్ని రాజమౌళి కూడా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ కి ఈ జీవితంలో పెళ్లికాదు. ఎందుకంటే అతనికి చాలా బద్ధకం. పెళ్లి కోసం ఓ అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని ఆమెతో మాట్లాడి ఆమెను ప్రేమించి, అమ్మాయి తల్లిదండ్రులని ఒప్పించి పెళ్లి చేసుకోవడం అంటే ప్రభాస్ కి చాలా బద్ధకం.అందుకే పెళ్లి చేసుకోవడం లేదు అని కూడా చెప్పారు.ఇక ఈ విషయం నిజమేనని ప్రభాస్ కూడా ఒప్పుకున్నారు. (Prabhas)