KTR reacts on Haryana election results

Haryana: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీల అమలు గురించి ప్రజలు ఇప్పుడు ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైందని కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎక్కడ? అవి అమలవుతున్నాయా? అని ప్రజలు కాంగ్రెస్‌ నేతలను నిలదీయాలని ఆయన అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం పండగ వాతావరణం లేకపోవడానికి కారణం కాంగ్రెస్‌ నేతల మోసమేనని కేటీఆర్ ఆరోపించారు.

KTR reacts on Haryana election results

హర్యానాలో జరిగిన తాజా ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ నేతలకు ప్రజలు గట్టి బుద్ధి చెప్పినట్లు స్పష్టమవుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. అక్కడి ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ మోసపూరిత పాలనను అర్థం చేసుకుని, సరిగ్గా సమయానికి వారి నిర్ణయం చెప్పారని పేర్కొన్నారు. తెలంగాణలో కూడా ప్రజలు కాంగ్రెస్‌ నేతల వాగ్దానాలను విశ్లేషించి, వారి వాస్తవ స్వరూపాన్ని గ్రహించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

Also Read: NTR-Prashanth Neel Film: అప్పుడే రిలీజ్ డేట్ టార్గెట్ చేసిన ఎన్టీఆర్..ప్రశాంత్ నీల్!!

కాంగ్రెస్‌ నేతలు హామీలు గుప్పించడంలోనే సరిపెట్టారని, వాటిని అమలు చేయడంలో మాత్రం విఫలమయ్యారని ఆయన విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ నాయకులు ఎన్నో ఆకర్షణీయమైన హామీలు ఇచ్చినప్పటికీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుపై కించిత్తు శ్రద్ధ పెట్టలేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

తెలంగాణ ప్రజలు కూడా హర్యానా ప్రజల మాదిరిగానే కాంగ్రెస్‌ పార్టీని నిలదీయాలని, వారి నిజ స్వరూపాన్ని గుర్తించి తగి తీర్పు ఇవ్వాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.