Ratan Tata: రతన్ టాటా మరణం దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఆయన చేసిన సేవలు అపారమైనవి. 20 ఏళ్లకు పైగా టాటా గ్రూప్‌ను నాయకత్వం వహించిన ఆయన, 74 ఏళ్ల వయసులో 2012లో పదవీ విరమణ చేశారు. ఆయనకు సంతానం లేకపోవడంతో, టాటా వారసత్వం ఎవరికీ దక్కుతుందనే చర్చలు వినిపిస్తున్నాయి. అయితే, టాటా గ్రూప్ ఈ విషయంలో ముందుచూపుతో వ్యవహరించింది; 2017లోనే ఎన్. చంద్రశేఖరన్‌ను టాటా సన్స్ చైర్మన్‌గా నియమించారు.
Who will inherit Ratan Tata wealth
టాటా వారసత్వం గురించి ప్రధానంగా చర్చనీయాంశం గా ఉన్న పేరు నోయెల్ టాటా. రతన్ టాటాకు సోదరుడు అయిన నోయెల్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు – మాయ, నెవిల్లే, లియా. ఈ ముగ్గురూ టాటా వ్యాపార సామ్రాజ్యంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. 34 ఏళ్ల మాయా టాటా, టాటా ఆపర్చునిటీస్ ఫండ్, టాటా డిజిటల్ వంటి సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టాటా న్యూ యాప్ విజయంలో ఆమె కీలక పాత్ర పోషించింది.
Also Read: Chandrababu: మహిళలకు దీపావళి కనుక..ఉచిత గ్యాస్ వారికీ మాత్రమే!!
ఇక 32 ఏళ్ల నెవిల్లే టాటా, టాటా కుటుంబ వ్యాపారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. టయోటా కిర్లోస్కర్ గ్రూప్ కు చెందిన మానసి కిర్లోస్కర్‌తో ఆయన వివాహం జరిగింది. ట్రెంట్ లిమిటెడ్ కింద ఉన్న ప్రముఖ హైపర్‌మార్కెట్ చైన్ స్టార్ బజార్‌కు నెవిల్లే నాయకత్వం వహిస్తున్నారు. భవిష్యత్తులో టాటా గ్రూప్ లో కీలక నాయకత్వ పాత్ర పోషించే సత్తా ఆయనకు ఉందని ఇది సూచిస్తుంది.
39 ఏళ్ల లియో టాటా, టాటా గ్రూప్ హాస్పిటాలిటీ విభాగంలో పనిచేస్తున్నారు. ఇండియన్ హోటల్ కంపెనీలో కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ, టాటా గ్రూప్‌ను హాస్పిటాలిటీ రంగంలో మరింతగా విస్తరించేందుకు కృషి చేస్తున్నారు. ఈ ముగ్గురు సంతానం టాటా వారసత్వాన్ని కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నారు.