Ys Jagan: కష్టాలు కొత్తేమీ కాదని…రాజకీయాల్లో కష్టాలు శాశ్వతం కాదని మాజీ సీఎం జగన్‌ పేర్కొన్నారు. మా నాన్న ముఖ్యమంత్రి అని.. అయినా కష్టాలు వచ్చాయని గుర్తు చేశారు. పెద్దవాళ్లంతా ఏకమయ్యారు, తప్పుడు కేసులు పెట్టారని తెలిపారు. 16 నెలలు జైల్లో పెట్టారు, వేధించారని చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా ప్రజలు ముఖ్యమంత్రిగా ఆశీర్వదింలేదా? అని గుర్తు చేశారు. మంచివైపు దేవుడు తప్పకుండా ఉంటాడని జగన్‌ వెల్లడించారు. రేపల్లె నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులతో జగన్‌ సమావేశం కావడం జరిగింది. Ys Jagan

Ys Jagan comments over his journey

ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ… ఐదేళ్ల పాలనా కలంలో గర్వంగా తలెత్తుకునేలా పరిపాలన చేశామన్నారు. నేను వైయస్సార్‌ సీపీ కార్యకర్తను అని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పుకోగలమని పేర్కొన్నారు. అన్ని పనులు ప్రజలకు చేశామని స్పష్టం చేశారు. మేనిఫెస్టో అనేది చెత్తబుట్టలో వేయదగద్ది కాదని, అది అత్యంత పవిత్రమైనదని ప్రపంచానికి మన పార్టీ మాత్రమే చెప్పిందని వివరించారు. Ys Jagan

Also Read: Jamili Elections: కేసీఆర్‌, జగన్‌ ను దెబ్బకొట్టేందుకు చంద్రబాబు స్కెచ్‌ ?

ప్రజలకు ఇచ్చిన మాటలను నెరవేర్చామని… బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయంలోనే సంక్షేమ క్యాలెండర్‌ను రిలీజ్‌ చేశామని స్పష్టం చేశారు. ప్రతినెలా క్రమం తప్పకుండా బటన్‌ నొక్కి పారదర్శకంగా ప్రతి ఇంటికీ లబ్ధి చేకూర్చమని వెల్లడించారు. ఒక్క వైయస్సార్‌సీపీ ప్రభుత్వం మాత్రమే ఇలా చేయగలిగిందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదని చెప్పుకొచ్చారు. మనకు ఓటు వేయకపోయినా మంచి చేశామన్నారు. వివక్ష, పక్షపాతం లేకుండా అందరికీ ఇచ్చామని వివరించారు. ఎన్నికష్టాలు వచ్చినా సాకులు చెప్పలేదని తెలిపారు జగన్‌. Ys Jagan