Nayanthara: నయనతార విజ్ఞేష్ శివన్ లు దాదాపు ఆరు ఏడు సంవత్సరాలు ప్రేమలో ఉండి సహజీవనం చేశాక చివరికి పెళ్లి చేసుకున్నారు. ఇక నయన్ కంటే విగ్నేష్ వయసులో చిన్నవాడైనా కూడా వీరిద్దరూ వయసుతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకొని సరోగసి ద్వారా ఇద్దరు పిల్లల్ని కూడా కన్నారు.అయితే అలాంటి నయనతార విజ్ఞేష్ శివన్ ల మధ్య ఓ సినిమా షూటింగ్లో గొడవ జరిగిందట.
A fight between Nayanthara and Vignesh
అది కూడా ఓ హీరోతో రొమాన్స్ కారణంగా.. మరి ఇంతకీ ఆ సినిమా ఏంటి..ఆ గొడవ ఎందుకు జరిగింది అనేది చూస్తే.. నయనతార విజ్ఞేష్ శివన్ కి మధ్య ప్రేమ చిగురించింది నానుమ్ రౌడీ ధాన్ అనే మూవీ సమయంలో.. ఈ సినిమాలో నయనతార విజయ్ సేతుపతి లు హీరో హీరోయిన్ గా చేశారు. అయితే ఈ సినిమాకి దర్శకత్వం వహించింది విగ్నేష్ శివన్. అలా ఈ సినిమా షూటింగ్లోనే నయనతార విగ్నేష్ లు ప్రేమలో పడ్డారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ సినిమా సన్నివేశం చెప్పి షూట్ చేస్తున్నారట.(Nayanthara)
Also Read: Naga Chaitanya: బ్రేకింగ్..ఆ హీరోయిన్ తో ఈరోజే నాగచైతన్య ఎంగేజ్మెంట్..?
ఆ టైంలో రొమాంటిక్ సన్నివేశం రావడంతో ఈ సన్నివేశం బాగా రాలేదు. ఇంకాస్త బాగా చేయండి అని నయనతార విజయ్ సేతుపతిలను కోరారట.కానీ ఓ పక్క లవర్ ని పెట్టుకొని మరో పక్క హీరోతో రొమాన్స్ ఎలా చేయగలను అని నయనతార అనుకుందో ఏమో కానీ గట్టిగా అరిచేసిందట.ఇంకేంటి డెప్త్ గా చేయాలి. అసలు నీ ప్రాబ్లం ఏంటి పెద్ద సైకో లాగా తయారయ్యావు అని అందరి ముందే గట్టిగా అరిచేసిందట.
ఆ తర్వాత సినిమా షూటింగ్లో ఇవన్నీ భాగమే కదా అని విగ్నేష్ శివన్ ఎంత బుజ్జగించినా కూడా నయనతార కాసేపు కోపంతోనే కూర్చుందట.ఆ తర్వాత కొద్దిసేపటికి చల్లబడి మళ్లీ సినిమా షూటింగ్లో పాల్గొందట. అలా ప్రేమించుకున్న సమయంలో వీరిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు, అలకలు వచ్చాయట. ఇక ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు కేవలం సీనియర్ నటి రాధిక కి మాత్రమే ఈ విషయం తెలుసట.(Nayanthara)